మెగా అభిమానుల ఆలోచన ధోరణి చాలా విచిత్రంగా ఉంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానులు ఏకమైపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతారా ? విజయవాడలో చిరంజీవి, పవన్ అభిమానుల సంయుక్త సమావేశం జరిగింది. రెండు అభిమాన సంఘాల్లోని అందరు కలిసి పనిచేసి పవన్ను సీఎం చేయాలని డిసైడ్ చేశారు. పవన్ ను సీఎం చేయటమే లక్ష్యంగా అందరు కలిసి పనిచేయాలని సమావేశంలో తీర్మానం చేశారు.






నిజంగా అభిమానుల సంఘాల వల్ల పవన్ ముఖ్యమంత్రి అయిపోయేట్లయితే మరి చిరంజీవి ఎందుకు సీఎం కాలేకపోయారు ? 2009లో ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు మెగా అభిమానులంతా కలిసే పనిచేశారు. ఎందుకంటే అప్పట్లో పవన్ కు సపరేట్ ఐడెంటిటి ఇకా పూర్తిగా రాలేదు. పవన్ ను అందరు చిరంజీవి సోదరుడిగానే చూసేవారు. ప్రాజారాజ్యంపార్టీలో పవన్ యువరాజ్యం అధిక్షుడిగా ఉండేవారు. కాబట్టి ఇద్దరి అభిమానసంఘాల సభ్యులు ప్రజారాజ్యంపార్టీ కోసమే పనిచేశారు.






మరి అప్పట్లో అంతచేసినా చిరంజీవి ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు. అప్పట్లో అభిమానసంఘాలే కాదు కాపుల్లో మెజారిటి ఎగబడి మరీ ప్రజారాజ్యంపార్టీకి పనిచేశారు. అంతచేసినా చిరంజవి పార్టీకి వచ్చింది 18 సీట్లే. అప్పట్లో చిరంజీవిని సీఎం చేయటమే లక్ష్యంగా అభిమానసంఘాలు, కాపులు పనిచేసినా ఎందుకు సాధ్యంకాలేదు ? ఎందుకంటే అభిమానులు పనిచేసినంత మాత్రాన ఎవరూ సీఎం కాలేరు. మామూలు జనాలు కూడా ఓట్లేస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారన్న విషయాన్ని మెగా అభిమానులు మరచిపోయారు.






ఇపుడున్న విచిత్రమైన పరిస్ధితి ఏమిటంటే పవన్ మీద అభిమానులకే నమ్మకంలేదు. బహిరంగసభలు పెట్టినా, రోడ్డుషోలు నిర్వహించినా పెద్దఎత్తున పాల్గొనే అభిమానులు ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే చాలాసార్లు చెప్పారు.  ఎందుకు ఇలా జరుగుతోందనే విషయాన్ని మెగా అభిమానులు నిజాయితీతో విశ్లేషించుకోవాలి. సీఎం అవ్వటానికి ఉన్న అవకాశాలు, అందుకు చేయాల్సిన కృషిగురించి అభిమానసంఘాలు చర్చించుకోకుండా మిగిలిన విషయాలు ఎన్ని చర్చించుకున్నా సమయం వృధాయే.  

మరింత సమాచారం తెలుసుకోండి: