చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ సత్తా తేలిపోయే సమయంవచ్చింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 23వ తేదీన ఉపఎన్నిక జరుగుతుంది. జూన్ 26వ తేదీన ఫలితం వస్తుంది. అధికారపార్టీ ఎంఎల్ఏ మేకపాటి గౌతమ్  రెడ్డి మరణం కారణంగా ఇక్కడ ఉపఎన్నిక అవసరమైంది. గౌతమ్ ప్లేసులో ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. టీడీపీ, బీజేపీ  తరపున ఎవరు పోటీలో ఉంటారో చూడాలి.





ఈ ఉపఎన్నికతో రెండు విషయాల్లో క్లారిటి వస్తుంది. మొదటిదేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఇంతకాలం చంద్రబాబునాయుడు చెబుతున్నది నిజమా కాదా అన్నది తేలుతుంది. రెండో అంశం ఏమిటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని చంద్రబాబు, పవన్ చెబుతున్న మాటలు ఎంతవరకు నిజమవుతాయో తేలిపోతుంది. నిజానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడటం వీళ్ళచేతుల్లో లేదు. అయినా సరే జనాలను మభ్యపెట్టటానికి ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసలు వీళ్ళ ప్రయత్నాలు సాగుతాయా ? బీజేపీ పడనిస్తుందా అనేది కూడా తేలిపోతుంది. 





వైసీపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి సింగిల్ అభ్యర్ధిని పోటీచేయిస్తాయా ? లేకపోతే ఏ పార్టీకాపార్టీయే పోటీచేస్తాయా అన్నది తేలిపోతుంది. ఎందుకంటే టీడీపీ పోటీలో ఉండేది లేనిది తేలలేదు. అయితే మిత్రపక్షాల తరపున బీజేపీ పోటీలో ఉంటుందని ఇప్పటికే కమలంపార్టీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించేశారు. ప్రతిపక్షాల్లో ఎన్ని పార్టీల అభ్యర్ధులు రంగంలో ఉంటారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే వైపీపీ అభ్యర్ధిపై ప్రజావ్యతిరేకత ఉందో లేదో తేలిపోతుంది.





మామూలుగా అయితే సానుభూతి పనిచేసి మరణించిన వాళ్ళ కుటుంబసభ్యులే గెలవాలి. కానీ చంద్రబాబు చెబుతున్న ప్రజావ్యతిరేకతే నిజమైతే విక్రమ్ గెలవకూడదు. సో ఆత్మకూరు ఉపఎన్నికతో చంద్రబాబు, పవన్ సత్తా ఏమిటో తేలిపోతుంది. ఒకవేళ సానుభూతి కారణంగా విక్రమే గెలిచినా టీడీపీకి ఎన్నిఓట్లు వస్తాయనేది కూడా కీలకమే అవుతుంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: