రెండురోజు క్రితం కొన్ని గంటలపాటు అట్టుడుకిపోయిన కోనసీమ అల్లటర్ల బాధ్యుల వివరాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికి పోలీసులు చేసిన అరెస్టులు, గుర్తించిన వారి వివరాలను బట్టిచూస్తే మెజారిటి పేర్లు జనసేన పార్టీకి సంబంధించినవిగానే ప్రచారమవుతోంది. మరికొన్ని పేర్లు తెలుగుదేశంపార్టీతో కూడా లింకున్నాయి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు పాత్ర బయటపడింది. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తను కూడా పోలీసులు అరెస్టు చేశారు. జరిగిన అల్లర్లలో వైసీపీ కౌన్సిలర్ కు పాత్రుందని మొదటి ప్రకటించిందే మంత్రి విశ్వరూప్. మరా కౌన్సిలర్ ఎవరో బయటపడాలి.





ఇదే విషయమై మంత్రి మాట్లాడుతు తమపార్టీ కౌన్సిలర్ జనసేన, టీడీపీలోని ద్వితీయశ్రేణి నేతల ప్రోద్బలంతోనే మరికొందరితో కలిసి అల్లర్లకు పాల్పడినట్లు స్వయంగా చెప్పారు. ఇప్పటివరకు పోలీసులు అరెస్టుచేసిన, గుర్తించిన వారిలో అత్యధికులు జనసేనకు సంబంధించిన వాళ్ళే అనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నప్పటికీ వాళ్ళ సంఖ్య తక్కువనే ప్రచారం గమనార్హం.





అంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జనాల ముందు జనసేన దోషిగా నిలబడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అల్లర్లు మొదలైన దగ్గరనుండి కూడా పార్టీలకు డైరెక్టుగా పాత్రలేదనే ప్రచారం జరుగుతోంది. కాకపోతే పై పార్టీల్లో బాగా యాక్టివ్ గా తిరిగే శెట్టిబలిజ, కాపు నేతల వ్యూహం, ప్రోద్బలమే ఎక్కువున్నట్లు పోలీసుల విచారణలో బయటపడుతోంది.






మంత్రి విశ్వరూప్, ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ ఇళ్ళమీద జరిగిన దాడులు, వాళ్ళ ఇళ్ళుంటున్న రోడ్లమీద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆందోళనకారులు సీసీ టీవీలను కూడా పగలగొట్టేశారు. ఆ విషయాలు కూడా వేరే కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లో అల్లర్లకు బాధ్యులెవరు, మాస్టర్ ప్లాన్ ఎవరిదనే విషయాన్ని పోలీసులు ఎస్టాబ్లిష్ చేయటం ఖాయం.  ఫోన్ సంభాషణలు, వాట్సప్ చాటింగులు కూడా సేకరిస్తున్నారు. హోలుమొత్తంమీద 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.  ప్రజల ముందు జనసేనపార్టీయే దోషిగా నిలబడుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: