వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు పెద్ద భారాన్నే మోయాల్సుంటుంది. మిగిలిన నియోజకవర్గాల్లో గెలుపు విషయం ఎలాగున్నా మూడు నియోజకవర్గాల్లో మాత్రం గెలుపు భారాన్ని కచ్చితంగా చంద్రబాబు వ్యక్తిగత బాధ్యతగా  తీసుకోవాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయంగా ఉంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. వస్తే బీజేపీ+జనసేనతో కలిసి టీడీపీ పొత్తులో పోటీచేయాల్సుంటంది.





ఏ కారణంవల్లనైనా బీజేపీ కలవకపోతే అప్పుడు మిగిలిన రెండుపార్టీలే పొత్తు పెట్టుకుంటాయి. అప్పుడే చంద్రబాబుకు అసలు సమస్య మొదలవుతుంది. ఎలాగంటే కుప్పంలో చంద్రబాబు పోటీచేసేది అనుమానమే అనే ప్రచారం తెలిసిందే. గడచిన ఏడు ఎన్నికలుగా ఇక్కడే పోటీచేస్తున్నారు కాబట్టి రేపటి ఎన్నికల్లో ఇక్కడినుండి పోటీచేస్తారనే అనుకుందాం. పోటీచేయటం వరకు ఓకేనే మరి గెలుపు అవకాశాలు ? గెలుపుకోసమే చంద్రబాబు నానా అవస్తలు పడాల్సుంటంది.





సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే కొడుకు లోకేష్ మాటేమిటి ? పుత్రరత్నం ఎక్కడినుండి పోటీచేస్తాడు ? ఎక్కడినుండి పోటీచేసినా గెలుపు బాధ్యతలను మోయాల్సింది మాత్రం చంద్రబాబే అనటంలో ఎవరికీ సందేహంలేదు. ఎందుకంటే లోకేష్ ను చూసి ఎవరు ఓట్లేయరు. అభ్యర్ధి లోకేషే అయినా తెరవెనుక, ముందునుండి మొత్తం వ్యవహారాలను నడపాల్సింది మాత్రం చంద్రబాబే. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీమ్ ను నియమించి ప్రతిరోజు మానిటర్ చేస్తుండాల్సిందే.





సరే పుత్రరత్నాన్ని పక్కనపెట్టేస్తే దత్తపుత్రుడిగా ప్రచారంలో ఉన్న పవన్ కల్యాణ్ మాటేమిటి ? టీడీపీ-జనసేన పొత్తు కుదిరినంత ఈజీగా కమ్మ-కాపుల మధ్య ఓట్లు ట్రాన్సఫర్ కావు. పర్ఫెక్టుగా ఓట్ల ట్రాన్సఫర్ అయి పవన్ గెలవాలంటే ఇందుకు కూడా చంద్రబాబే బాధ్యత తీసుకోవాల్సుంటుంది. పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ నుండి ఎవరైనా బలమైన అభ్యర్ధి పోటీలో ఉంటే ఇటు పవన్ అటు చంద్రబాబుకు ఓట్లబదిలీ విషయంలో నానా తిప్పలు పడాల్సిందే. అంటే కుప్పంలో గెలుపుకు కష్టపడుతునే మిగిలిన రెండు చోట్ల గెలుపుకు చంద్రబాబే అవస్తలు పడాల్సుంటంది. మరి మూడు నియోజకవర్గాల్లో గెలుపు భారాన్ని చంద్రబాబు మోయగలరా ?






మరింత సమాచారం తెలుసుకోండి: