సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పేరుతో వైసీపీకి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి యాత్రలు జరిగిన సందర్భాలు లేవు. కానీ జగన్ హయాంలో మంత్రివర్గంలో 70శాత సీట్లు కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించి చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. ఆ విషయాన్ని ప్రజలకు సూటిగా చెప్పేందుకే యాత్ర మొదలైంది.

యాత్ర మొదలైనప్పటి నుంచి వైసీపీలో ఒకటే టెన్షన్. జగన్ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానం వారిలో ఉంది. వారు ఊహించినట్టుగానే తొలిరోజు సభ వర్షం కారణంగా సజావుగా సాగలేదు. బస్సు యాత్ర సభా ప్రాంగణానికి చేరుకునే లోపే భారీ వర్షం కారణంగా సభా వేదిక తడిసిపోయింది. దీంతో ప్రజలు కూడా వేదిక వద్దకు రాలేకపోయారు. మంత్రు వచ్చే సమయానికి సభికులు ఎవరూ లేకపోవడంతో.. కాసేపు వేదికపై నుంచిని అభివాదాలు చేసి వారు వెనుదిరిగారు. రెండో రోజు యాత్రపై ఫోకస్ పెట్టారు.

నాలుగు రోజుల యాత్ర, నాలుగు చోట్ల భారీ బహిరంగ సభలతో షెడ్యూల్ ప్రాన్ చేశారు. దీన్ని సజావుగా కొనసాగించేందుకు ఓ టీమ్ రంగంలోకి దిగింది. ప్రతి ఊరిలో బస్సు యాత్రకు ఘన స్వాగతం పలుకుతున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఇక నాలుగు రోజులపాటు బహిరంగ సభలకోసం పార్టీ కార్యకర్తలను, ప్రజలను తరలిస్తున్నారు. టీడీపీ మహానాయుడి పోటీగా ఈ బస్సు యాత్రను డిజైన్ చేశారు వైసీపీ నాయకులు. ఆ పోటీతోనే.. అడుగడుగునా భారీగా జన సమీకరణ చేస్తున్నారు. అయితే తొలిరోజు వర్షం కారణంగా యాత్ర సజావుగా పూర్తి కాలేదు. రెండోరోజు రాజమండ్రిలో భారీ బహిరంగ సభ జరగాల్సి ఉంది. దీంతో ఈ సభకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకోసం భారీగా జన సమీకరణ చేస్తున్నారు. బస్సు యాత్రలో మంత్రులు పాల్గొంటున్నా.. వారి వెంట ఇతర నాయకులు అనుసరిస్తూ రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్నారు. ప్రతి ఊరిలో ఈ కార్యక్రమాన్ని పండగలా చేయాలని భావిస్తున్నారు వైసీపీ నాయకులు. దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన మూడురోజులపాటు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: