కొన్ని పరిస్థితులు కారణంగా దేశంలోని అన్నీ వస్తువుల పై ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే..ముఖ్యంగా చెప్పాలంటే ముడి చమురు..అంటే పెట్రోలు, డీజెల్ మొదలగు వస్తువుల పై ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగడం వల్ల మిగిలిన వస్తువులు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.మొన్న జరిగిన రష్య-ఉక్రెయిన్ ల మధ్య జరిగిన యుద్ధం కారణంగా ధరలు మరింత పెరిగాయి..అదే విధంగా వంట నూనెల ధరలు కూడా ఆకాశానికి నిచ్చెనలు వేసాయి..


ఈ మేరకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శాఖ వినూత్నంగా నిరసన చేపట్టింది. ట్యాక్సులు లేకుండా పెట్రోల్‌ అసలైన ధర ఎంతో యువతకు తెలిపేందుకు ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక పెట్రోల్ బంకును ఎంచుకుని అక్కడ ఒక గంట పాటు 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువకులకు రూ.60 రూపాయలకే పెట్రోల్ పోసింది. దీంతో అక్కడకు యువత క్యూ కట్టింది...



వివరాల్లొకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న పరశురామ్ వాటిక సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద గురువారం యువకులు క్యూ కట్టారు. అక్కడ 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువకులకు రూ.60 రూపాయలకే పెట్రోల్ పోస్తుండడమే దానికి కారణం. అక్కడ తోపులాట జరగడంతో పోలీసులు మొహరించి ఒక్కొక్కరికీ టోకెన్లు ఇచ్చి పంపారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శాఖ ఈ విధంగా తమ నిరసనను వ్యక్తం చేసింది. రూ.60కే పెట్రోల్ పోయించుకున్న వారి బైక్‌లపై ధరల గురించిన పోస్టర్లు అంటించింది..



ఇకపోతే ఎంపీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రమోద్ ద్వివేది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. `పెట్రోల్ అసలు ధర రూ.60 మాత్రమే. ఒక్క లీటర్ పెట్రోల్‌పై ఎంత పన్ను కడుతున్నామో యువత గుర్తించాలి. ఈ పన్నుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. అన్ని వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దేశాన్ని ప్రభుత్వం ఎలా దొచుకుంది.యువకులు పూర్తిగా ఈ విషయం పై ఆలొచించాలి అని నేతలు హెచ్చరించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: