ఒంగోలు మహానాడు వేదికమీద నుండి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పిన డైలాగులపై ఎన్ని సామెతలు చెప్పినా తక్కువే. ఆయన మాట్లాడిన మాటల్లో సినిమా డైలాగుంది. జగన్మోహన్ రెడ్డిపై సినిమా డైలాగు చెప్పి లోకేష్ విరుచుకుపడటమే విచిత్రంగా ఉంది. జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతు తన మామగారి డైలాగు ‘ఫ్లూటు జింకముందు ఊదు.. సింహం ముందుకాదు’ అనే డైలాగు పేల్చారు. సినిమాలో బాలయ్య చెప్పిన ఆ డైలాగు బాగా పేలింది.





మామగారు చెప్పిన డైలాగు బాగా పాపులరైంది కదాని అల్లుడు లోకేష్ కూడా చెబితే ఏం బాగుంటుంది ? పైగా ఆ డైలాగు జగన్ ను ఉద్దేశించి చెప్పటం మరీ విచిత్రంగా ఉంది. లోకేష్ ఉద్దేశ్యంలో తాను సింహం అయినట్లు, జగన్ జింక అన్నట్లుగా ఉంది. ఇక్కడే లోకేష్ లోని పైత్యమంతా బయటపడింది. విషయం ఏమిటంటే పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎంఎల్ఏగా పోటీచేయటానికి భయపడి దొద్దిదోవన ఎంఎల్సీ అయిపోయి మంత్రివర్గంలోకి వచ్చింది లోకేషే.





ఎంఎల్ఏగా పోటీచేయటానికి తాము రాజీనామాలు చేస్తామని ముగ్గురు ఎంఎల్ఏలు ఓపెన్ ఆఫరిచ్చినా పోటీచేసేందుకు లోకేష్ ధైర్యం చేయలేకపోయారు. లోకేషే కాదు కొడుకు గెలుపుపై ధైర్యంలేక చంద్రబాబు కూడా పోటీకి అంగీకరించలేదు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కొడుకుగా, మంత్రిగా మంగళగిరిలో పోటీచేసిన లోకేష్ చిత్తుగా ఓడిపోయారు. అధికారంలో ఉండగా ఎంఎల్ఏగా పోటీచేయటానికి భయపడిన ఏకైక నేతగా లోకేష్ రికార్డు సృష్టించారు.





ఇక 2019 ఎన్నికల్లో తన రెక్కల కష్టంమీదే పార్టీ అఖండ మెజారిటితో అధికారంలోకి తెచ్చిన జగన్ ను జంకంటారా ? సింహం అంటారా ? అనేది లోకేషే అర్ధం చేసుకోవాలి. జగన్ సింహమా కాదా అన్నది జనాలే తేల్చారు మళ్ళీ తొందరలోనే తేలుస్తారు. అలాగే జింకెవరో ఇప్పటికే జనాలు తేల్చేశారు. మరిద్దరిలో సింహం ఎవరు ? జింకెవరు ?

మరింత సమాచారం తెలుసుకోండి: