కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ క్యాష్ లెస్ చెల్లింపులకి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే నగదు ఒకరి చేతి నుండి మరొకరి చేతికి రావడం వల్ల కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది అని వైద్య నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ పేమెంట్ వైపు అడుగులు వేశారు. దీంతో ప్రస్తుతం  వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఇక ఎక్కువగా ఎంత సులభరీతిలో ఉన్న ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ప్రస్తుతం జనాలు కొత్త టెక్నాలజీ ని ఉపయోగించుకుంటూ ఆన్లైన్ పేమెంట్ వైపు అడుగులు వేస్తుంటే కొన్ని విషయాలలో మాత్రం తప్పనిసరిగా నగదు లావాదేవీలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణింఛే సమయంలో టికెట్ కండక్టర్ వద్ద టికెట్ కోసం నగదు ఇవ్వడం.. మిగతా చిల్లర తీసుకోవడం లాంటివి చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో కూడా ఆన్లైన్ పేమెంట్ అందుబాటులో ఉంటే ఎంత బాగుండు అని చాలామంది ప్రయాణికులు కోరుకున్నారు.


 ఇకపోతే మరికొన్ని రోజుల్లో ప్రయాణికుల అందరి కోరిక నెరవేరబోతోంది అన్నది తెలుస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుతం ప్రయాణికుల సౌకర్యార్థం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇక నగదు రహితంగా బస్సు టికెట్లు పొందేలా సరికొత్తగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ఆన్లైన్ పేమెంట్ యాప్స్ తో టికెట్స్ కొనుగోలు చేసేలా ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే డ్రైవర్లు కండక్టర్ల వద్ద టికెట్ ఇష్యూయింగ్ యంత్రాల స్థానంలో ఈ - పోస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకు వస్తుందట. పైలెట్ ప్రాజెక్టు కింద విజయవాడ గుంటూరు డిపో నుంచి  హైదరాబాద్,విశాఖ, తిరుపతి, బెంగుళూరు, చెన్నై నగరాల్లో కి వెళ్లే బస్సులు ఈ మెషిన్లను  ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: