పెట్రోల్‌ బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీరు సదుపాయాన్ని ఖచ్చితంగా కల్పించాలి. దీనికోసం పెట్రోల్‌ పంప్‌ డీలర్‌ ఆర్‌ఓ మెషిన్‌, వాటర్‌ కూలర్‌ ఇంకా అలాగే వాటర్‌ కనెక్షన్‌ను ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఏ పంపులోనైనా తాగునీటి సౌకర్యాలు కనుక లేకపోతే, మీరు "చమురు మార్కెటింగ్‌ సంస్థ"కు ఫిర్యాదు చేయవచ్చు.అలాగే వాహనదారులు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే ఆ సమయంలో మొబైల్‌ ఫోన్‌ లేకపోతే, ఇక సమీపంలో వున్న ఏదైనా పెట్రోల్‌ పంపు దగ్గరకు వెళ్లి, తరువాత అక్కడనున్న టెలిఫోన్ ద్వారా మీరు ఏ నంబర్‌కు అయినా కాల్స్‌ చేయవచ్చు. ఇక ఈ సౌకర్యం పెట్రోల్‌ పంపులలో ఉచితంగా లభిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా పెట్రోల్‌ పంపుల వద్ద శుభ్రమైన బాత్‌ రూమ్స్‌ సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాలి. దీన్ని ఉపయోగించడాన్ని ఎవరూ కూడా ఆపలేరు. పెట్రోల్‌ పంప్‌ వద్ద మురికి నీరు ఇంకా అలాగే సరైన బాత్‌ రూమ్స్‌ లేకుంటే మీరు చమురు కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు.అలాగే ప్రతి పెట్రోల్‌ పంపు వద్ద ప్రథమ చికిత్స కిట్‌ అనేది తప్పకుండా ఉండాలి.



ఎందుకంటే సాధారణ ప్రజలు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రథమ చికిత్స కిట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తే, మీరు దాని గురించి రాతపూర్వక ఫిర్యాదు చేయవచ్చు.అలాగే పెట్రోల్‌, డీజిల్‌ కి సంబంధించి పెట్రోల్‌ పంప్‌ యజమాని లేదా ఏజెంట్‌ మీకు బిల్లు ఇవ్వడానికి కనుక నిరాకరిస్తే, మీరు వెంటనే దాని గురించి కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే టైర్లలో గాలి నింపడానికి అన్ని పెట్రోల్‌ పంపుల వద్ద కూడా ఎయిర్‌ మెషీన్‌ తప్పనిసరిగా ఉండాలి. ఇక గాలి నింపడానికి ఇక్కడ డబ్బులు వసూలు చేయడానికి లేదు.అలాగే ప్రతి పెట్రోల్‌ పంపులో కూడా ఫిర్యాదు బాక్స్‌ లేదా రిజిస్టర్‌ ఉంచాలి,ఎందుకంటే ఇందులో వినియోగదారులు తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఇక పెట్రోల్‌ పంప్‌ వద్ద పైన పేర్కొన్న సదుపాయాలు ఏవీ మీకు అందించకపోతే లేదా కల్పించకపోతే మీరు సెంట్రలైజ్డ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ పోర్టల్‌ను సందర్శించి వారి గురించి ఫిర్యాదు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: