గులాబీ పువ్వు.. దీనిని ఇష్టపడని వారు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రేమికులకైతే ఇక గులాబీ మరింత ఇష్టమని చెప్పాలి. ఎందుకంటే తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ ప్రేయసి ముఖంలో చిరునవ్వు చూడటానికి ఎంతో మంది అబ్బాయిలు గులాబీ పువ్వును గిఫ్ట్ గా ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. మరి కొంత మంది మహిళలు గులాబి పూలు తలలో పెట్టుకుని అందంగా కనిపించాలని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అంతేకాదు ఇప్పటి వరకు సినిమాల్లో రోజ్ రోజ్ రోజా పువ్వా అంటూ ఎన్నో పాటలు కూడా గులాబీ పువ్వు మీద ఉన్నాయి. అందుకే ప్రతి ఆడపిల్ల కూడా గులాబీ చెట్టు తమ ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక పెరట్లో ఉన్న గులాబీ పువ్వులు కోసి రోజు తలలో పెట్టుకోవడానికి మరింత ఆసక్తి చూపుతుంటారు. అందుకే ఎవరి ఇంట్లోకి వెళ్లిన తప్పకుండా గులాబీ మొక్క కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇష్ట ప్రకారం గులాబీ మొక్కలు ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు అందరూ. కానీ ఇలా పెంచుకోవడం మంచిదా కాదా అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు అనే చెప్పాలి.



 ఇంతకీ ఈ విషయంలో పండితులు ఏం చెబుతున్నారంటే.. ఇంట్లో గులాబీ మొక్కలు పెంచుకోవడం ఎంతో మంచిది అంటూ సూచిస్తున్నారు. ఈ చెట్టు ఇంట్లో పెంచుకోవడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా కూడా ఉంటారట. ఇక గులాబీ మొక్కలు వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో ఉంచితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళి పోతుందట. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ మొక్కలను నైరుతి దిక్కున ఉంచడం మంచిది అంటున్నారు పండితులు. ఇక మీరు ఉంటున్నది ఎలాంటి ఇల్లు అయినా సరే నివాసం ఉండే ప్లేస్ కి దక్షిణం వైపు ఉంటే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: