ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోంది.ఈ పథకం కింద 1 వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.14వేలు చొప్పున జమ చేస్తోంది. జూన్ 21 వ తేదీ న అమ్మఒడి కింద సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.ఇక ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఐతే ఇంకా కొంతమందికి అర్హత ఉండీ.. అనర్హుల జాబితాలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. అలాంటి వారికి ప్రభుత్వం ఇప్పుడు మరో అవకాశం కల్పిస్తోంది. అర్హత ఉండీ జాబితాలో కనుక లేకుంటే వెంటనే వివరాలను సరిచేసుకోవాలని సూచిస్తోంది.ఇక మొదట అమ్మఒడి అనర్హత జాబితాలో ఉంటే మీరు ఏ కారణం చేత పథకాన్ని నిలిపేశారో ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ వినియోగం కనుక 300 యూనిట్ల దాటితే అనర్హులవుతారు. ఐతే మీరు అద్దె ఇంట్లో ఉంటూ.. ఆధార్ కార్డ్ ఆధారంగా 300 యూనిట్ల వినియోగం మించినట్లు గుర్తిస్తే.. వెంటనే విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి.. ఆధార్ కార్డు ఇంకా మీటర్ నెంబర్ తో పాటు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఈడీ బల్బులు తీసుకున్న ఆధారాలు ఖచ్చితంగా చూపించాలి. అలా అయితే మీకు ఇంకా ఆ విద్యుత్ మీటర్ కు సంబంధం లేదంటూ ఓ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేస్తారు. దాన్ని గ్రామ ఇంకా వార్డు సచివాలయంలో ఇచ్చి వివరాలను అప్ డేట్ చేయించుకోవాలి.



అలాగే రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల పేరు మీద పట్టణాలలో ఐతే వెయ్యి చదరపు అడుగుల నివాసస్థలం, గ్రామాల్లో 700 చదరపు అడుగులు నివాసస్థలం ఉంటే ఖచ్చితంగా అమ్మఒడికి అనర్హులు. విద్యార్థి కుటుంబ సభ్యులంతా కూడా ఒకే రేషన్ కార్డులో ఉండి వారిలో ఎవరి పేరుమీదైనా అర్హతకు మించిన స్థలముంటే అమ్మఒడి రాదు. విద్యార్థి తాత ఇంకా అలాగే నానమ్మల పేరుతో ఆ స్థలముంటే వెంటనే తల్లిదండ్రులు మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించి రేషన్ కార్డులో సపరేట్ అవ్వాల్సి ఉంటుంది.విద్యార్థి ఇంకా అతడి తల్లి ఇద్దరూ ఒకే మ్యాపింగ్ లో ఉండేలా చూసుకోవాలి. అలా లేకుంటే వెంటనే వాలంటీర్ ను సంప్రదించి మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి. ఒకవేళ స్టూడెంట్ పేరు కనుక రేషన్ కార్డులే లేకుంటే.. బర్త్ సర్టిఫికెట్ ను గ్రామ సచివాలయంలో సమర్పించి వారి రేషన్ కార్డులో చేర్పించాలి.ఇక పొరబాటున తల్లిదండ్రుల పేర్లు అధిక ఆదాయమున్న లిస్టులో కనుక ఉంటే.. వెంటనే వారికి ఎకౌంట్ ఉన్న బ్యాంక్ నుంచి ఫాప్-60ని పొంది ఆ గ్రామ సచివాలయంలో సబ్ మిట్ చేయాలి. అలా చేయకుంటే వారికి అమ్మఒడి డబ్బులు రావు.ఇక స్టూడెంట్ మదర్ బ్యాంకు అకౌంట్ కి మ్యాప్ అయిన ఆధార్ ఫోన్ నెంబర్ ఒకటే ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందా లేదో చెక్ చేసుకొని కాకపోతే లింక్ చేయించుకోవాలి. ఒకవేళ IFSC Code ఏమైన మారిన బ్యాంక్ ఎకౌంట్లు ఉంటే.. వెంటనే ఆ కోడ్ ను అప్ డేట్ చేయించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: