ప్రజలు ఆర్దికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఎన్నో కొత్త పథకాలతో పాటుగా కొన్నిటికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. మరి కొన్నిటిలో వ్యాపారం ప్రారంభించడానికి ఆర్థిక సాయాన్ని చేస్తున్నారు.కాగా, దేశ వ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.2024 మార్చి నాటికి మొత్తం 10,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు.


ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే పేదలకు నాణ్యమైన మందులు అందిస్తోంది. ఎవరైనా ఈ వ్యాపారం ప్రారంభించే అవకాశం కల్పిస్తోంది. జన్ ఔషధి కేంద్రాల్లో మెడిసిన్ బయటి మార్కెట్‌తో పోలిస్తే 50 శాతం నుంచి 90 శాతం తక్కువకే లభిస్తాయి..అంతేకాదు 1600 పైగా మందులు, 250 పైగా సర్జికల్ డివైజ్‌లు, న్యూట్రాసూటికల్, ఆయుష్ ప్రొడక్ట్స్, సువిధ శానిటరీ ప్యాడ్స్ అమ్ముతోంది.



కాగా, ప్రస్తుతం 406 జిల్లాల్లో 3,579 బ్లాక్స్‌లో జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. చిన్న పట్టణాలు, బ్లాక్స్‌లో కూడా వీటిని ఏర్పాటు చేస్తోంది.రూ.2,50,000 నుంచి రూ.5,00,000 మధ్య ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది. ఫర్నీచర్, కంప్యూటర్, ప్రింటర్ లాంటివి కొనడానికి మహిళలకు, దివ్యాంగులకు, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి ఒకసారి రూ.2,00,000 ఇన్సెంటీవ్ ను కూడా ఇస్తుంది.ఇకపోతే మెడిసిన్ చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది.ముందుగా https://janaushadhi.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.


హోమ్ పేజీలో APPLY FOR KENDRA ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
వివరాలన్నీ చదివిన తర్వాత Check Available Location పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా సెలెక్ట్ చేయాలి.
మీరు ఎంచుకున్న ప్రాంతంలో జన్ ఔషధి కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే Click here to Apply పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
ఆసక్తి కలిగిన వాళ్ళు వెబ్ సైట్ ను ఓపెన్ చేసి పూర్తిగా చదివి అప్లై చేయగలరు..

మరింత సమాచారం తెలుసుకోండి: