టీడీపీ నాయకురాలు దివ్యవాణి పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు అన్న విషయం మీద ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కానీ ఈమె తన రాజకీయ జీవితాన్ని ఏ పార్టీలో కొనసాగిస్తారు అన్న విషయంపై ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఏపీలో టీడీపీ నాయకులుగా ఉండి రాజీనామా చేస్తే, వారికి ఉండేది కేవలం రెండు పార్టీలే... ఒకటి బీజేపీ రెండవది జనసేన. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు టీడీపీ లో ఉండి వైసీపీ పై ఒక రేంజ్ లో విమర్శలు చేసిన ఏ నేత అయినా సరే మళ్ళీ వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉండరు. ఇప్పుడు మాజీ టీడీపీ నేత దివ్య వాణి పరిస్థితి కూడా అదే అని చెప్పాలి.

కానీ రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమె బీజేపీ లోకి వెళ్ళడానికి ప్రణాళికలు రచిస్తోందట. ఇందుకు ముందుగా ఏపీ బీజేపీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే సోమవారం లోగా బీజేపీలో చేరుతారని భోగట్టా. కాగా ఏమీ ఇంతకు ముందు వరకు టీడీపీ లో అధికార ప్రతినిధిగా ఉన్నారు. పార్టీలో ఉంటూ ఎదుటి పార్టీలపై ఒక రేంజ్ లో విరుచుకుపడే సామర్ధ్యం ఉంది ఈమెకు. వైసీపీలో ఎలా అయితే ఫైర్ బ్రాండ్ గా రోజా ఉందో, టీడీపీ లో దివ్యవాణి కూడా అదే స్థాయిలో పాపులర్ అయింది.

కాగా ఈమె టీడీపీ నుండి బీజేపీకి రావడం పట్ల ఏపీ బీజేపీ నాయకులు లేదా కార్యకర్తల నుండి ఏమైనా విముఖత ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కొందరు అయితే ఇది చంద్రబాబు ఎన్నికల కోసం వేసే ప్రణాళికలో ఒక భాగమే అని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇలా చూస్తే ఇది ఎంత మేరకు టీడీపీ కి ఉపయోగం కానుంది అన్నది తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: