దశాబ్దాల క్రితమే సొంతరాష్ట్రమైన  జమ్మూ కాశ్మీర్ ను వదిలేసి ఎక్కడెక్కడో వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ వెతికి పట్టుకుని మరీ నరేంద్రమోడి ప్రభుత్వం ఏదేదో చెప్పి మళ్ళీ జమ్ము-కాశ్మీర్ కు తీసుకెళ్ళింది. ప్రభుత్వం చెప్పింది కదాని, అవసరమైన భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చింది కాబట్టే దేశంలో ఎక్కడెక్కడో ఉన్న పండిట్లు, హిందు కుటుంబాలన్నీ మళ్ళీ జమ్మ-కాశ్మీర్ కు చేరుకున్నారు.





దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితమే తీవ్రవాదుల దెబ్బకు కాశ్మీరీ పండిట్లు, చాలామంది హిందువులు కాశ్మీరు లోయలోని తమ కొంపా, గోడు, ఆస్తులన్నింటినీ వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఎందుకంటే తీవ్రవాదులు కాశ్మీరీ పండిట్లు, హిందువులను టార్గెట్ చేసి మరీ చంపుతున్నారు. హిందు, పండిట్ల కుటుంబాల్లోని మహళిలను ఎత్తుకెళ్ళిపోయారు. వీళ్ళ అరాచకాలను భరించలేక కాశ్మీరు లోయలో నుండి ఇతర ప్రాంతాలకు పరిపోయారు. ఎక్కడెక్కడ పండిట్లు ఎలా బతుకుతున్నారో తెలీదు కానీ ఏదో గుట్టుచప్పుడు కాకుండా బతికేస్తున్నారు. 





అలాంటివాళ్ళందరినీ మోడి ప్రభుత్వం కలిసి నచ్చచెప్పి మళ్ళీ కాశ్మీరులోయలోకి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఏమిచేసిందంటే గాలికొదిలేసింది. అందుకనే వరుసగా రెండునెలలుగా మళ్ళీ పండిట్లు, హిందువులను తీవ్రవాదులు చంపేస్తున్నారు. ఒకవైపు సైన్యం, మరోవైపు పారామిలిటరీ దళాలు, ఇంకోవైపు పోలీసులు ఉండికూడా హత్యలు, అరాచకాలను ఆపలేకపోతున్నారు. జమ్ము-కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 350 రద్దుచేస్తే యావత్ లోయంతా తమ నియంత్రణలోకి వచ్చేస్తుందని తీవ్రవాదం తగ్గుతుందని మోడి ప్రభుత్వం ఆర్టికల్ ను రద్దుచేసింది.





మొత్తం జమ్మూ-కాశ్మీర్ ను తాను అనుకున్నట్లుగానే కంట్రోల్లోకి అయితే తీసుకుంది కానీ తీవ్రవాదం మాత్రం అదుపులోకి రాలేదు. పైగా ఇపుడు హిందువులు, పండిట్ల హత్యలు మళ్ళీ పెరిగిపోతున్నాయి. వీళ్ళందరినీ రక్షించలేనపుడు మోడి సర్కార్ ఎందుకని అందరినీ కాశ్మీరులోయలోకి తరలించినట్లు ? జరుగుతున్నది చూస్తుంటే కాశ్మీర్ పండిట్ల విషయంలో మోడి అట్టర్ ఫెయిలైనట్లే  తోస్తోంది. ప్రతిరోజు స్కూళ్ళు, బ్యాంకులు, ఆఫీసుల్లో పనిచేసుకుంటున్న పండిట్లను, హిందువులను ఏరికోరి మరీ తీవ్రవాదులు చంపేస్తున్నారు. చివరకు పండిట్లు, హిందువుల బతుకులు ఇలాగైపోయాయి కాశ్మీర్లో.


మరింత సమాచారం తెలుసుకోండి: