మొన్ననే ముగిసిన తెలుగుదేశంపార్టీ పండుగ మహానాడు సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. గడచిన మూడు సంవత్సరాలుగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన ఎన్ని పిలుపుల్లో కూడా కనబడని నేతలు, కార్యకర్తలు మహానాడు రెండు రోజుల్లో కనిపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్ని పిలుపులిచ్చినా నేతల్లో చాలామంది కనీసమాత్రంగా కూడా రెస్పాండ్ కాలేదు.






మిగిలిన జిల్లాల సంగతి ఎలాగున్నా మహానాడు జరిగిన ప్రకాశం జిల్లాలో నలుగురు ఎంఎల్ఏలున్నారు. వీరిలో చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ ను తీసేసినా మిగిలిన ముగ్గురు ఎంఎల్ఏలు+నేతలు కూడా పెద్దగా స్పందించిందే లేదు. అలాంటిది ఇపుడు మహానాడు ఊహించినదానికన్నా ఎందుకు సక్సెస్ అయ్యింది ? ఎందుకంటే ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిదేమో భవిష్యత్తులో మహానాడు జరుగుతుందో లేదో కూడా తెలీదు.






ఎందుకంటే రెండేళ్ళకోసారి మహానాడు జరుగుతుంది. వచ్చే మహానాడంటే సరిగ్గా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జరగాలి. 2019 మే నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ షెడ్యూల్ ఎన్నికలు 2024, ఏప్రిల్లో జరిగితే మేలో ఫలితాలు వస్తాయి. టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికైతే ఎవరు అనుకోవటంలేదు. ఫలితాలు రాగానే మహానాడు నిర్వహణంటే ఒక్కళ్ళు కూడా ముందుకురారు.






ఇక రెండో కారణం ఏమిటంటే ఈ మహానాడు ఏ కారణం వల్లయినా ఫెయిలైతే దీని ప్రభావం వచ్చే ఎన్నికలపై పడటం ఖాయం. అందుకనే ముందుగానే మహానాడు విజయవంతం చేయాలని చంద్రబాబు తన మద్దతుదారులకు ప్రత్యేకించి తన సామాజికవర్గంలోని కీలక వ్యక్తులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. అంటే ఈ మహానాడు నిర్వహణను చంద్రబాబు, కమ్మ ప్రముఖులు చావో రేవోగా తీసుకున్నారు. అందుకనే ఎవరికి వారుగా ప్రత్యేక శ్రద్ధతీసుకుని, తమింటి పండుగలాగ శక్తికిమించి పనిచేశారు. ఈ రెండు కారణాల వల్ల మహానాడు సక్సెస్ అయ్యింది. లేకపోతే ఇంతగా సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. సరే మరీ సక్సెస్ ను చంద్రబాబు కంటిన్యు చేయగలరా ?



మరింత సమాచారం తెలుసుకోండి: