మొబైల్‌ ఫోన్ అనేది లేకపోతే రోజు గడవని రోజుల్లో మనం జీవిస్తున్నాం. ముఖ్యంగా ఈ కాలంలో పిల్లలు ఎంతగా మొబైల్‌ గేమ్‌లకు అలవాటుపడిపోతున్నారంటే..ఇక ఒక్కోసారి అవి తీవ్ర నష్టాలకు కూడా దారితీస్తాయి. ఇదే తరహాలో ఓ ఘటన అనేది హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ పిల్లవాడు ఆన్‌లైన్‌ ఆటలకు బానిసయ్యి తన తల్లి దాచి ఉంచిన బ్యాంక్‌ అకౌంట్‌ బ్యాలన్స్‌ రూ.36 లక్షల మొత్తం ఖాళీ చేశాడు. పాపం తన భర్త మరణంతో వచ్చిన ఆ డబ్బును దాచి ఉంచితే ఇలా జరిగిందంటూ.. ఆ తల్లి ఎంతగానో వాపోయింది.ఇక హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఎసిపి కె.వి.ఎం.ప్రసాద్‌ వివరాల మేరకు ... అంబర్‌పేట్‌కు చెందిన ఓ బాలుడు (16) తన తాత మొబైల్‌ తీసుకొని అందులో 'ఫ్రీ ఫైర్‌ గేమింగ్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. తన తాత ఫోన్‌లో ఉన్న తన తల్లి అకౌంట్‌ నుంచి మొదటగా రూ.1,500 పెట్టి ఆట ప్రారంభించాడు. ఆ తర్వాత రూ.10 వేల చొప్పున డబ్బులు పెడుతూ ఆడాడు. అలా.... హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ నుంచి మొత్తం రూ.9 లక్షలు ఖాళీ అయ్యాయి.


అలాగే ఆ తర్వాత ఎస్‌బిఐ బ్యాంక్‌ ఖాతాలోంచి ఒకసారి రూ.2 లక్షలు ఖాళీ అయ్యాయి. మరోసారి ఆటకు రూ.1.60 లక్షలు ఇంకా రూ.1.45 లక్షలు, ఇలా... విడతలవారీగా మొత్తం రూ.27 లక్షలతో బాలుడు ఆడాడు. మొత్తంగా అతడు రూ.36 లక్షలు ఖాళీ అయ్యాయి.ఇక ఈ క్రమంలో ... ఆ బాలుడి తల్లి తనకు డబ్బులు అవసరమై బ్యాంక్‌కు వెళితే ఖాతా ఖాళీ అని అధికారులు చెప్పడంతో ఆమె ఆందోళన చెంది హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తుని చేపట్టగా...ఆ .బాలుడి ఆటతో హెచ్‌డిఎఫ్‌సి ఖాతాలోంచి రూ.9 లక్షలు ఇంకా అలాగే ఎస్‌బిఐ ఖాతా నుంచి రూ.27 లక్షలు పోయినట్లుగా గుర్తించారు. ఇక ఈ విషయం తెలిసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఈ డబ్బు తన భర్త కష్టార్జితమని ఇంకా ఆయన సైబరాబాద్‌ పోలీసుశాఖలో ఉన్నతాధికారిగా పని చేసేవారని.. తన భర్త మృతితో వచ్చిన ప్రయోజనాలే ఈ డబ్బు అని బాలుడి తల్లి పోలీసులతో చెప్పి ఎంతగానో కన్నీంటిపర్యంతమయ్యారు.


ఇలాంటి సంఘటనలు చాలా సంఖ్యలో జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం కేవలం మన పనిలో మాత్రమే నిమగ్నమవ్వకుండా పిల్లల గురించి కూడా పట్టించుకోవాలి. వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారో ఖచ్చితంగా గమనించాలి. ఇలాంటి గేమ్స్ ఆడుతుంటే ఖచ్చితంగా వారిని హెచ్చరించి శిక్షించాలి. మరీ ముఖ్యంగా మీ మొబైల్ పాస్ వర్డ్స్ వారికి చెప్పకూడదు. ఇంకా మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వారికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడండి. అలాంటి గేమ్స్ ఆడటం వల్ల ఎంత నష్టమో వారికి అర్ధమయ్యేలాగా తెలిసేలా చెప్పడం ప్రతి పేరెంట్ బాధ్యత. కాబట్టి పిల్లలకి చిన్నప్పటినుంచే ఇలా ఫోన్లు అలవాటు చెయ్యకుండా కొంచెం బయటి ఆటలు, అలాగే ఏమైన మైండ్ గేమ్స్ చెస్, క్యారం బోర్డ్స్ లాంటి ఆటలు అలవాటు చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: