ఎల్లోమీడియా అధిపతి చంద్రబాబునాయుడుకు మిత్రుడో లేకపోతే అనుకూల శతృవో కూడా తమ్ముళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం జనాల్లోని వ్యతిరేకత కళ్ళబడకుండా గంతలు కట్టేశారు. చివరకు ఎన్నికల్లో టీడీపీ మాడుపగిలేట్లు కొట్టారు జనాలు. దాంతో జనాల దెబ్బకు చంద్రబాబుకు కళ్ళుబైర్లు కమ్మి బొమ్మ కనబడింది. ఇపుడు క్షేత్రస్ధాయిలోని వాస్తవాలను చంద్రబాబుకు వక్రబుద్ధిలో చూపిస్తు తమ పబ్బం గడుపుకుంటున్నారు.





తాజాగా రాసిన చెత్తపలుకు అనే సోది ఆర్టికల్లో ఒక నిజాన్ని బయటపెట్టారు. అదేమిటంటే తెలంగాణాలో ఓటుకునోటు వ్యవహారం జరిగింది నిజమే అని బల్లగుద్ది మరీ చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే తెలంగాణాలో కేసీయార్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబు పెద్ద ప్లానే వేశారు. ఇందులో భాగంగానే ఎంఎల్సీ ఎన్నికల్లో ఎంఎల్ఏ ఓట్లకొనుగోలుకు వ్యూహం రచించి అడ్డంగా కేసీయార్ కు చంద్రబాబు దొరికిపోయారు. ఎప్పుడైతే ప్లాన్ ఫెయిలైందో అరెస్టు చేస్తారనే భయంతోనే  అర్ధరాత్రి హైదరాబాద్ వదిలేసి విజయవాడకు పారిపోయారు చంద్రబాబు.






అప్పటినుండి కేసీయార్ గురించి కలలో తలచుకోవాలన్నా కూడా చంద్రబాబు భయపడిపోతున్నారు. అలాంటి ఓటుకునోటు కేసు జరిగింది ముమ్మాటికి వాస్తవమే అని చెత్తపలుకులో ఎల్లోమీడియా అధిపతి స్పష్టంగా అంగీకరించారు. ఆయన రాతల్లోనే ‘రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబును కేసీయార్ టార్గెట్ గా పెట్టుకున్నారు’..చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే ఒక తెలంగాణా ఎంఎల్ఏని కోవర్టుగా మార్చుకుని ఓటుకునోటుకు స్కెచ్ వేశారట. సదరు ఎంఎల్ఏ ద్వారా రేవంత్ రెడ్డి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఏసీబీని రంగంలోకి దింపారు. ఇదేమీ తెలియని రేవంత్ రెడ్డి అందులో ఇరుక్కుపోవటమే కాకుండా చంద్రబాబు కూడా ఇరుక్కుపోయారట.





 ఇది చదివిన వాళ్ళకు ఏమి తెలుస్తుంది ? ఓటుకునోటు కేసు నిజమే అని, కేసీయార్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రయత్నించినట్లు అర్ధమవ్వటంలేదా ? ఓటుకునోటు కేసుకు చంద్రబాబే సూత్రదారిగా  అర్ధంకావటంలేదా ? ఇపుడు చెప్పండి ఎల్లోమీడియా చంద్రబాబుకు మిత్రపక్షమా లేకపోతే శతృపక్షమా ? ఓటుకునోటు కేసులో సూత్రదారని తేల్చేసిన ఎల్లోమీడియా చంద్రబాబుకు పెద్ద షాకే ఇచ్చింది.




మరింత సమాచారం తెలుసుకోండి: