చూడబోతే తన అభిమానులపై జనసేన అధినేత,  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు నమ్మకం లేనట్లుంది. అందుకనే తన అభిమానులను కాదని హోలు మొత్తంమీద మెగా అభిమానుల పేరుతో ఒక సమావేశం జరిగింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మెగా అభిమాన సంఘాల ప్రముఖులతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో మెగా అభిమానులంతా కలిసి పవన్ను ముఖ్యమంత్రిని చేయాలట.






ఇక్కడ గమనించాల్సిందేమంటే మెగా అభిమానులంటే చిరంజీవి+రామ్ చరణ్+పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రమేనట. బన్నీ తదితరుల అభిమానసంఘాలు వేరే ఉన్నాయట. వాళ్ళతో మెగా అభిమానసంఘాలకు సంబంధంలేదట. అంటే ఎన్నికల సమయానికి అందరి అభిమానసంఘాలు కలుస్తాయేమో ఇప్పుడే ఎవరు చెప్పలేకున్నారు. అభిమానసంఘాల్లోని ముఖ్యులతో నాదెండ్ల సమావేశం పెట్టుకుని సభ్యులు, అభిమానులంతా పార్టీని గ్రామస్ధాయివరకు తీసుకెళ్ళాలని కోరారు.





ఇక్కడ గమనించాల్సిందేమంటే చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాన్ అభిమానులంటే దాదాపు కాపులే అయ్యుంటారు. కాపులు వేరు అభిమానసంఘాలు వేరుకాదు. చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు అభిమానసంఘాలు, కాపు సంఘాలు, కాపు ప్రముఖుల్లో అత్యధికులు విరగబడి పనిచేశారు. వీళ్ళంతా కలిసి చేసిన ఓవర్ యాక్షన్ వల్ల నాన్ కాపు సెక్షన్లకు ఒళ్ళుమండిపోయింది. దాంతో చిరంజీవి చతికిలపడిపోయారు. ఫలితాలను విశ్లేషిస్తే కాపుల్లో కూడా ఎక్కువమంది చిరంజీవికి ఓట్లేయలేదని తేలింది.





ఇక 2019 ఎన్నికల్లో కూడా కాపులు, మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానుల్లో చాలామంది జనసేనకు ఓట్లేయలేదు. చివరకు పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా ఓట్లేయకపోవటంతో పవన్ ఓడిపోయారు. తనకు ఓట్లేయని అభిమానులపై పవన్ అనేకసార్లు మండిపడిన విషయం అందరికీ తెలిసిందే. మెగా అభిమానులంతా అప్పట్లో ప్రజారాజ్యంపార్టీ నుండి మొన్నటి జనసేనవరకు క్యారీ ఫార్వర్డయినా ఉపయోగం కనబడలేదు. మరి రేపటి ఎన్నికల్లో మాత్రం ఏమి ఉపయోగం ఉంటుంది ? వీళ్ళు ఓట్లేసేస్తే జనసేన అధికారంలోకి వచ్చేస్తుందా ? మిగిలిన సామాజికవర్గాలు ఓట్లేయక్కర్లేదా ? తన అభిమానులపై నమ్మకం పోయినట్లుంది పవన్ కు. అందుకనే మెగా అభిమానసంఘాల పేరుతో మీటింగ్ పెట్టి అందరినీ కలుపుతున్నారు. మరీసారి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: