కుక్క అంటే అందరికి విశ్వాసమైన జంతువు అని తెలుసు..ఒక ముద్ద అన్నం పెడితే జీవితాంతం మనకు తోడుగా ఉంటుంది. అయితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత కూడా ఉందనుకోండి.అయితే కుక్కలు ఊరికే మనుషులను కరవవు..ఎందుకంటే వాటికి విపరితంగా కోపం వస్తే తప్ప మాములుగా ఎవరి జోలికి వెళ్లవు..ఒకప్పుడు కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లను వేస్తారు. ప్రభుత్వం దావఖానాలొ మరీ ఇప్పటికీ కూడా ఉన్నాయని తెలుస్తుంది.అయితే ఇప్పుడు  మాత్రం కొన్ని ఇంజెక్షన్లు మాత్రమే వేస్తారు.


కుక్క కరిస్తే యాంటి రేబీస్‌ టీకాలు వేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. ఆపై బెంగళూరు పాలికెలో దరఖాస్తు చేసుకుంటే పరిహారం కూడా లభిస్తుంది. వీధి కుక్క కరిస్తే బీబీఎంపీ పరిహారం అందించే విషయం చాలామందికి తెలియదు. దీంతో గత ఏడేళ్లలో 32 వేలమందికి పైగా కుక్కకాట్లుకు గురైనప్పటికీ అక్షరాలా 25 మంది మాత్రమే పరిహారం తీసుకున్నారు.కుక్క కరిచిన గాయాన్ని బట్టి పరిహారం ఇస్తున్నారట అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..



హైకోర్టు ఆదేశాలతో గత 8 ఏళ్ల నుంచి వీధి కుక్కల బాధితులకు బీబీఎంపీ పరిహారం అందిస్తోంది. పరిహారాన్ని ఎలా లెక్కిస్తారంటే ప్రతి గాయానికి రూ.2 వేలు, లోతైన గాయమైతే రూ.3 వేలు, గాయాలు సంఖ్య ఎక్కువగా ఉంటే రూ.10 వేలు పరిహారం లభిస్తుంది. అలాగే చికిత్స వ్యయాన్ని కూడా బీబీఎంపీ భరిస్తుంది..ఒకవేళ కుక్క కరిచి పిల్లలు చనిపోతే రూ.50 వేలు, పెద్దలు చనిపోతే లక్ష రూపాయలు సదరు కుటుంబానికి అందించాలి. 2016 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు బీబీఎంపీ పరిధిలో 32,161 మంది వీధి కుక్కల బారినపడ్డారు. వీరిలో కేవలం 25 మంది దరఖాస్తు చేసుకుని పరిహారం పొందారు.



25 మందికి.. రూ.15 లక్షలు.2016-17లో ఒక వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేశాయి, పరిహారం, చికిత్స వ్యయంతో కలిపి రూ.70,430ను పాలికె అందజేసింది. 2017-18 లో ముగ్గురికి కలిపి రూ.60,645 ఇచ్చింది. 2018-19లో విభూతిపురలో ప్రవీణ్‌ అనే బాలుడు వీధికుక్కల దాడిలో మృతిచెందాడు. ఆ కుటుంబానికి పరిహారం, ఆసుపత్రి వ్యయం తో కలిపి రూ.8,42,963 ముట్టజెప్పింది. 2019-20 లో 9 మందికి రూ.2,07,292, 2020-21 లో 7 మందికి రూ.2,22,540, 2021-22 లో నలుగురి కి రూ.85,431 పరిహారం ఇచ్చింది.అలా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం పరిహారం రూ.15 లక్షలకు చేరింది..


మరింత సమాచారం తెలుసుకోండి: