ఈ సారి అర్హులు అందరికీ అమ్మఒడి అందుతుందా అంటే కాదనే వినిపిస్తోంది. ఈ ఏడాదికి గాను ఎపుడో అందాల్సిన అమ్మఒడి ఆలస్యం అయిన విషయం తెలిసిందే. అదీ చాలదు అన్నట్టు ఎలిజిబుల్ లిస్ట్ లో చాలా మంది విద్యార్థుల పేర్లు మాయం అయ్యాయి. అదేంటి అని అడిగితే సరైన సమాధానం చెప్పే వారు లేక తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది అమ్మఒడి ద్వారా లబ్ది పొందిన వారిలో చాలా మందికి ఈ సారి అమ్మఒడి అందేలా కనిపించడం లేదు. కారణం ఎలిజిబుల్ లిస్ట్ లో వారి పేరు లేకపోవడమే. ఇదేంటి అని ప్రశ్నిస్తే తల్లి పేరు అప్డేట్ కాలేదు, విద్యార్దులు హాజరు సరిగా లేదు ఇలా పలు కారణాలు చెబుతున్నారు. మరి కొందరికి అయితే సరిగా సమాధానం కూడా చెప్పకుండా అటు ఇటు తిప్పుతున్నారు.

అమ్మఒడి గురించి తెలుసుకోవడం కోసం అందరూ సచివాలయాలకు వెళ్ళాలని సూచిస్తుండడంతో విద్యార్థుల తల్లితండ్రులు సచివాలయాలకు తిరుగుతున్నారు. అయితే అక్కడికి  వెళ్లాక, జాబితాలో పేర్లు లేవంటే మళ్లీ పాఠశాలలకు వచ్చి కంప్లైంట్ చేస్తే . కొన్నిచోట్ల మాత్రం హాజరు తక్కువ ఉందని అని చెబుతున్నారు..కాగా  పాఠశాలల నుంచి మళ్ళీ లేఖలు తీసుకుని అవి పట్టుకుని మళ్ళీ సచివాలయాలకు వెళ్లి అప్‌లోడ్‌ చేయించినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.  అప్డేట్ తర్వాత కూడా.. జాబితాలో పేర్లు లేకపోవడంతో తల్లి తండ్రులు చింతిస్తున్నారు. ఎవరు సరిగా సమాధానం చెప్పడం లేదు...స్కూల్స్ లో మాకు సంబంధం లేదు సచివాలయాలకు వెళ్లాల్సిందే అంటున్నారు మరి అక్కడికి వెళితే సమాధానం లభించడం లేదు.

అలాంటప్పుడు ఈ ఈ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుంది. అయితే ఈసారి మాకు అమ్మఒడి అందనట్టేనా అని చాలా మంది తల్లితండ్రులు వాపోతున్నారు. పాఠశాలలకు జాబితా ముందుగా ఇచ్చి అన్నీ సరిదిద్దిన తరవాత అక్కడ నుండి ఎంఈవో స్థాయికి ఇస్తే అక్కడ మిగిలినవి పూర్తి చేసి  మళ్ళీ సచివాలయాలకు ఇస్తే బాగుంటుంది అంటున్నారు. అయినా ఎడిటింగ్ ఆప్షన్ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా పోయిన ఏడాదితో పోలిస్తే ఈ సారి చాలా మందికి అమ్మఒడి రాదనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: