పొద్దున లేచినప్పటి నుంచి పడుకోనె వరకూ పాలతో చాలా మందికి పని ఉంటుంది.. టీ, కాఫీ లతొ రోజు ముందుకు సాగదు..అయితే ఇంట్లో గేదె వుంటే ఆ పాలు రుచి వేరు.. పల్లెల్లో అయితే ఉంటాయి.. కానీ,టౌన్ లో పాలు ఉండవు.. అందరు ప్యాకెట్ పాలతో సర్దుకు పోతున్నారు. అదే వాళ్ళ పాలిట శాపం అయ్యింది. కల్థీ పాల దందా జోరుగా సాగుతోంది.అసలు విషయాన్నికొస్తే.. పాలలాంటి కల్తీ పాలు.. కాసుల కోసం జనం ఆరోగ్యంతో ఆడుకునే కల్తీగాళ్ల పాపాలు.. అవి తాగిన వారి ఆరోగ్యం ఆస్పత్రిపాలవుతోంది..


కాదేదీ కల్తీకి అనర్హం అనే సామెతను సరిగ్గా వంటబట్టించుకుంటున్నారు. కొందరు పాల వ్యాపారులు. ప్రాణాలు తీసే రసాయనాలతో కల్తీ పాలను తయారు చేసి జనం మీదకు వదులుతున్నారు. కాసుల వేటలో మానవత్వం మరుస్తున్నారు. పాలు పోసే వారి నుంచి డెయిరీ కంపెనీల వరకు అంతా కల్తీ పాలను తయారు చేస్తున్నారు. ప్యాకెట్లలో నింపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.ఈ కల్తీ పాల వ్యవహారం రెండు మూడు సార్లు బయటపడింది.. వాళ్ళకు అధికారులు తగిన బుద్ది చెప్పారు.. అయిన కొందరు మారలేదు.. అదే పులిని చూసి నక్క వాథ పెట్టుకుంది అన్నట్లు ఒకరిని మించి మరొకరు తయారు అవుతున్నారు.



గ్రేటర్‌ హైదరాబాద్‌ నివసించే జనాభా కోటికి పైనే. రోజువారీ పాల అమ్మకాలు దాదాపు 30 లక్షల లీటర్లు. సహకార డెయిరీలు దాదాపు 10 లక్షల లీటర్లు విక్రయిస్తుండగా.. ప్రైవేట్‌ డెయిరీలు దాదాపు 20 లక్షల లీటర్లు విక్రయిస్తున్నాయని అంచనా. స్వచ్ఛమైన లీటర్‌ పాలకు 90 రూపాయల వరకు ధర పలుకుతుండగా.. ప్యాకెట్ పాలు 40 నుంచి 50 రూపాయల మధ్యలో దొరుకుతున్నాయి. అంటే.. ఒరిజినల్ పాలకన్నా.. ప్యాకెట్‌ పాల ధర దాదాపు సగం.టాప్‌ బ్రాండ్ల పాలపై ఎలాంటి కంప్లైంట్లు లేకపోగా.. కొత్తగా పుట్టుకొస్తున్న బ్రాండ్లు.. ప్రైవేట్ వ్యాపారులు కల్తీ పాలను తయారు చేసి జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారని వాదనలు వినిపిస్తోంది..ఈ విషయం పై సర్కారు ఎలా స్పందిస్తుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: