ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కీలకంగా మారనున్నాడు.. పార్టీని స్థాపించి ఇంతకాలం అయినా ఇంకా పవన్ రాజకీయాల పరంగా అంత ప్రభావవంతంగా లేడనే చెప్పాలి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది కూడా 2019 ఎన్నికల నుండి మాత్రమే. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ సంగతి దేవుడెరుగు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన గాజువాక మరియు భీమవరం రెండు చోట్లా ఓడిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. వాస్తవంగా పవన్ అక్కడ గెలవాల్సింది. అయితే వైసీపీ ప్రభంజనం ముందు పవన్ కళ్యాణ్ అభిమానం నిలవలేదు.

అయితే ఇక రానున్న ఎలక్షన్స్ లో పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి నెలకొంది. పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో తిరుపతి నుండి పోటీ చేస్తాడని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. కాగా పోటీ చేయడం అటుంచితే... అక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని ప్రచారంలో ఉంది. అయితే ఇదే భావన పవన్ మనసులో ఉందా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇలా జనసేన పాలిటిక్స్ పై మరియు పవన్ కళ్యాణ్ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతుంటే.. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండనున్నాయి అని ప్రజల నుండి వినబడుతోంది. ప్రస్తుతం రాష్ట్రము ఉన్న పరిస్థితుల్లో గోదావరి జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని చోట్ల అధికార పార్టీకి ప్రమాదకరమైన సంకేతాలు అయితే లేవని తెలుస్తోంది .

అలాంటిది పవన్ కళ్యాణ్ తిరుపతి లో నిలబడి ఇక లక్ష ఓట్ల మెజారిటీ అంటేనే సోషల్ మీడియాలో నెటిజన్లు ముందు అసలు గెలవమను... లక్ష  మెజారిటి గురించి ఆలోచిద్దాం అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి అసలు పవన్ తిరుపతిలో నిలుస్తాడా ? నిలిచినా గెలుస్తాడా ? అన్న పలు విషయాలు తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: