ఇండస్ట్రీలో గ్లామరస్ డాల్, పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన వ్యక్తి రోజా గారు. ప్లాట్ ఫామ్ ఏదైనా తనదైన శైలిలో సత్తా చాటుతూ గుర్తింపు పొందటం రోజా గారిది పెట్టింది పేరు. ఓ వైపు కుటుంబం, మరో వైపు సినిమాలు, టీవి షోలు, ఇంకోవైపు రాజకీయాలు ఇది నిన్న మొన్నటి వరకు రోజా గారి షెడ్యూల్. అన్నిటిలోనూ అంతటా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మన్నలను పొందిన ఘనత రోజా గారికే సొంతం. అయితే తాజాగా ఆమెను మంత్రి పదవి వరించడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు రోజా. ఒకేసారి ఇంత పెద్ద బాధ్యతను పెట్టుకుని కెమెరా ముందుకు రాలేనని ఆమె ప్రేక్షకులకు చెప్పేశారు. కానీ ఒక ప్రజా ప్రతినిధిగా ఎపుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని మాటిచ్చారు.

ఇటీవల మంత్రివర్గ విస్తరణలో భాగంగా రోజా ఏపీ పర్యాటక శాఖ అభివృద్ధి మంత్రిగా బాధ్యతలను అందుకున్నారు.
పాలిటిక్స్ లో రోజా గారిది అందువేసిన చెయ్యి . ఎంతటి వారినైనా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు డీ అంటారు ఈ లేడీ. అలాంటి ఈ ఫైర్ బ్రాండ్ కు ఈసారి సొంత నియోజకవర్గంలోనే గట్టి పోటీ తప్పదన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. రోజా నియోజకవర్గం నగరి లో ఇపుడు వాతావరణం హాట్ హాట్ గా ఉంది.  అక్కడ రోజాపై పోటీ చేసుందుకు ఓ సెలబ్రిటీ.. మరో పొలిటికల్ ఫ్యామిలీ రంగం సిద్దం చేస్తోంది. ఇరువురు స్ట్రాంగ్ కావడంతో టికెట్ ఎవరి చేతికి ఇస్తే అధిక ప్రయోజనం ఉంటుంది అనే విషయంలో ఇపుడు చంద్రబాబు పెద్ద ఇరకాటంలో పడ్డారు. నగిరి నియోజక వర్గంలో రోజా గారికి మంచి పట్టు ఉంది. అక్కడ ఆమెకు పెద్ద ఎత్తున ప్రజాభిమానులు ఉన్నారు.

అక్కడ ఎపుడు అందుబాటులో ఉండే నేతగా ప్రజలకు బాగా దగ్గరయ్యారు రోజా. అయితే నగరిలో రోజాకు పోటీగా మరో నేతను దించి విజయాన్ని అందుకోవాలని అక్కడ టిడిపి పార్టీ జెండా ఎగురవేయాలని అన్నది చంద్రన్న స్కెచ్. అందుకే  పోటీగా మరో సెలబ్రిటీనీ కానీ లేదా సీనియర్ నేతను  దింపితే రోజాకు చెక్ పెట్టొచ్చు అని ప్రణాళికలు రచిస్తున్నారట చంద్రబాబు. కాకపోతే ఇక్కడ ఆయనకు వచ్చిన చిక్కల్లా సినిమా నటా లేక సీనియర్ నేత అన్న విషయం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తమ పార్టీ నుండి తప్పుకుని వైసిపి లో చేరిన నేత రోజాకు రఫ్ అండ్ టఫ్ పోటీ ఇచ్చే నేత ను రంగం లోకి దింపి నగిరి నియోజక వర్గానికి సొంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు.

అయితే ఇందుకు మరో సినీ సెలబ్రిటీ అయితేనే కరెక్ట్ అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆ టికెట్ కాస్త ఆ సెలబ్రిటీ చేతికి వెళ్ళేటట్లు కనిపిస్తోంది.  ఇంతకీ ఆ నటి మరెవరో కాదు వాణి విశ్వనాథ్. 2019 ఎన్నికలకు ముందే ఈమె టిడిపి పంచన చేరారు.. కానీ పెద్దగా యాక్టివ్ గా ఉండరు. అయితే ఈ మధ్య ఆమె పాలిటిక్స్ లో జోరు బాగా పెంచారు. అదీకాక నగిరి  నియోజక వర్గం లోనూ ఈమెకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఈసారి  ఈమెకు టిడిపి టికెట్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా  కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: