తాజాగా పార్టీలోని ముఖ్య కార్యకర్తలతో భేటీ నిర్వహించారు సిఎం జగన్. ఈ మీటింగ్ లో నేతలకు పార్టీని వచ్చే ఎన్నికల్లో కూడా ఎలా మళ్ళీ అత్యదిక మెజారిటీతో గెలిపించాలి అన్న దానిపై హితబోధ చేశారట. ఈ భేటీలో ముఖ్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తీసుకోవాల్సిన స్టెప్స్ అలాగే జాగ్రత్తలు గురించే ఎక్కువ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి మరింత మెజారిటీ రావాలని 175కు 175 సీట్లు సాధించాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు మనపై పెంచుకున్న నమ్మకానికి మించే చేశామని, చేస్తున్నామని అని ఆయన అన్నారు. కుప్పం మునిసిపాలిటీలో మనం విజయం సాధిస్తామని అసలు అనుకున్నామా ? అలాంటిది ఇపుడు ప్రజలకు ఇంత చేశాం వారు ఇంకెంత అభిమానాన్ని కలిగి ఉంటారు.

అందుకే ఈ సారి మన టార్గెట్ 175 కు 175 అని ఆయన అన్నారట. గడపగడపకు మన ప్రభుత్వం అనేది ఎన్నికల కోసం కాదని ఇది నిరంతర కార్యక్రమమని ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోవడం వాటిని తీర్చడం ప్రధమ కర్తవ్యం అని అన్నారు జగన్.  ఇదంతా సరే కానీ సిఎం జగన్ లక్ష్యం అయితే 175 సీట్లకు 175 సీట్లను సాధించడం. కానీ ఇది సాధ్యమా అంటే కష్టమే అనిపిస్తోంది. వైసిపి పార్టీపై ప్రజలకు ఉన్న అభిప్రాయం అధికారానికి ముందు అధికారానికి తర్వాత అన్నట్లుగా ఉంది పరిస్థితి.  ఎందుకంటే ప్రజల అంచనాలకు సిఎం జగన్ పూర్తిగా చేరుకోలేకపోగా
కొత్తగా విమర్శల పాలయ్యారు అన్నది  వాస్తవం. పోలీసుల ఆధిపత్యం ఎక్కువ అయిపోయింది అని, అభివృద్ధి లేదు అని జనాల్లో  నుండి విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అయితే ఈ పార్టీ ఓడిపోవడం ఖాయం ఆ అంటే అది కాదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే జగన్ మొదటిసారి అధికారం లోకి వచ్చారు. అయినా వీలైనంత లో ప్రజలకు మంచే చేస్తున్నారు. ప్రజలకు పథకాలు ఎక్కువగా అందుతున్నాయి. మిగిలిన పార్టీలు కంటే ఈ పార్టీ నే మేలు అన్న అభిప్రాయాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా వైసిపి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటున్నారు. కానీ జగన్ ఆశిస్తున్న స్థాయిలో అన్ని సీట్లు దక్కుతాయని అనుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: