షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అన్నీపార్టీలు ఒకదానిపై మరొకటి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే అధికారాన్ని నిలుపుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గట్టి వ్యూహం అమలు చేయబోతున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. అంటే ప్రతిపక్షాలంటే అన్నీకాదు టీడీపీ, జనసేన, బీజేపీలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్, వామపక్షాలు కూడా ప్రతిపక్షాలే అయినప్పటికీ వాటిని ఎవరు పట్టించుకోవటంలేదు.





పై మూడు పార్టీల నేతలు కేవలం మీడియాలో మాత్రమే కనబడుతుంటారని గ్రహించాలి. అందుకనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలను ఫిక్స్ చేయటానికి జగన్ డిసైడ్ అయ్యారట. దీనికి తాజాగా మంత్రి రోజాతో పాటు మాజీమంత్రి పేర్నినాని కేంద్రప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. రెండురోజుల పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో బీజేపీయే అధికారంలోకి రాబోతోందని చెప్పి  వైసీపీ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడారు.





దీనికి రోజా, పేర్నినాని గట్టిగానే తగులుకున్నారు. పనిలోపనిగా నడ్డాతోనే ఆగకుండా నరేంద్రమోడి వల్ల దేశానికి జరగిన లాభం ఏమిటని నిలదీస్తునే రాష్ట్రానికి జరిగిన నష్టంపైన కూడా మాట్లాడారు. అంటే ఇంతకాలం కేంద్రానికి వ్యతిరేకంగానో లేకపోతే మోడీని నిలదీస్తునో మంత్రులు  పెద్దగా మాట్లాడిందిలేదు. కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయికాబట్టి మంత్రులెవరు మోడిని ప్రశ్నించటంలేదు. అలాంటిది ఇపుడు మొదలుపెట్టారంటే జగన్ ఆదేశాలు లేకుండా సాధ్యంకాదు.





రాష్ట్రప్రయోజనాలను నరేంద్రమోడి ప్రభుత్వం తుంగలో తొక్కేస్తున్న విషయమై తొందరలోనే మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలందరు మాటలయుద్ధం మొదలుపెట్టబోతున్నట్లు అనుమానంగా ఉంది. ఒకసారి మోడీ ప్రభుత్వంపై యుద్ధం మొదలైందంటే అందులోకి అనివార్యంగా చంద్రబాబు, పవన్ను కూడా లాగేస్తారు. 2014-19 మధ్యలో  రాష్ట్ర ప్రయోజనాలను మోడి సర్కార్ ఎంతగా దెబ్బకొట్టినా చంద్రబాబు నోరిప్పలేకపోయారు. ఇదే సమయంలో పవన్ కూడా కళ్ళుమూసుకుని కూర్చున్నారు. ఇపుడు కూడా మోడీ సర్కార్ ను చంద్రబాబు, పవన్ నిలదీయలేకపోతున్నారు. అలాంటిది ఇపుడు మంత్రులు వైసీపీ నేతలు మోడీని నిలదీయటం మొదలుపెడితే కచ్చితంగా వీళ్ళు కూడా మాట్లాడాల్సొస్తుంది. లేకపోతే జనాల ముందు వీళ్ళని దోషులుగా నిలబెట్టడమే జగన్ వ్యూహంగా ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.





మరింత సమాచారం తెలుసుకోండి: