వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద టార్గెట్టే ఫిక్స్ చేశారు. మంత్రులు, ఎంఎల్ఏలు, జిల్లాల అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 గెలిచితీరాల్సిందే అంటు అందరికీ కచ్చితంగా చెప్పారు. ఏ ఒక్కసీటు తగ్గినా తాను ఊరుకునేదిలేదని ఖరాఖండిగా దాదాపు వార్నింగ్ ఇచ్చినంతపని చేశారు. నిజానికి నూటికి నూరుశాతం అసెంబ్లీ సీట్లు గెలుచోకవటం సాధ్యమేనా ?





కష్టమనే అందరికీ తెలుసు. అయితే టార్గెట్ 175 అని ఫిక్స్ చేస్తేకానీ పార్టీలోని అందరు ఎన్నికలను, గెలుపును సీరియస్ గా తీసుకోరని జగన్ భావన అయ్యుండచ్చు. అయితే 175 సీట్లలో గెలుపుకు జగన్ ఇపుడు కూడా కుప్పంలో చంద్రబాబునాయుడును ఓండిచటమే టార్గెట్ గా చూపిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించినంతమాత్రాన 175 సీట్లూ వైసీపీ ఖాతాలో పడిపోవు. కాకపోతే పార్టీ అధినేత చంద్రబాబునే కప్పంలో ఓడించగలిగినపుడు మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఎందుకు గెలవదనేది జగన్ లాజిక్.





తన వాదనకు మద్దతుగా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అనుకున్నామా ? కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని అనుకున్నామా ? అని అందరిని నిలదీశారు. గట్టిగా ప్రయత్నించిన కారణంగానే కుప్పంలో టీడీపీని ఓడించగలిగినట్లు చెప్పారు. కాబట్టే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే టార్గెట్ గా అందరు కలిసికట్టుగా పనిచేస్తే కచ్చితంగా కుప్పంలో కూడా వైసీపీ గెలుస్తుందన్నారు.





జగన్ చెప్పిన లాజిక్ బాగానే ఉందికాని తమ్ముళ్ళల్లో చాలామంది చంద్రబాబుకన్నా క్షేత్రస్ధాయిలో బలమైన నేతలే అన్న విషయం జగన్ మరచిపోయారు. అచ్చెన్నాయుడు, చింతకాయల అన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు లాంటి కొందరు నేతలు దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో పాతుకుపోయున్నారు. పైగా టీడీపీ పెట్టిన దగ్గరనుండి ఇప్పటివరకు ఓడిపోని హిందుపురం నియోజకవర్గం ఉండనే ఉంది. చంద్రబాబుతో పోల్చితే పైన చెప్పుకున్న నేతలు చాలామంది బలవంతులే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అందరినీ ఓడించాలంటే వైసీపీ నేతలు మామూలుగా కష్టపడితే కుదరదు. ఇందుకు జనామోదం కూడా చాలా అవసరం. చూద్దాం చిరవకు ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: