కార్మిక చట్టాల ప్రకారం రోజుకి 8గంటలు మాత్రమే పనిచేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కార్మికులతో పని చేయించుకుంటే అదనపు వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపై ఇలంటి చట్టాలకు కాలం చెల్లింది. జూలై 1నుండి నూతన కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ కొత్త చట్టాలు అమలులోకి వస్తే, ఆఫీసు పని వేళల పూర్తిగా మారిపోతాయి. ఇప్పుడు 8నుంచి 9 గంటలు పనిచేసేవారు భవిష్యత్తులో రోజుకి 12 గంటలు పనిచేసే అవకాశం ఉంటుంది. దీనికి అనుగుణంగా వారానికి 3 రోజులు సెలవు తీసుకోవచ్చు. అయితే పనిగంటలు పెరిగినా.. వేతనం మాత్రం పెరగదు. పైగా పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది కాబట్టి.. ఒకరకంగా చేతికి వచ్చే జీతం తగ్గుతుంది.

నాలుగు కొత్త లేబర్ కోడ్‌ లను వీలైనంత త్వరగా అమలులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్త కార్మిక చట్టాల వల్ల దేశంలో పెట్టుబడులు పెరిగే అవకాశాలున్నాయి, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.

కొత్తగా వచ్చే మార్పులేంటి..?
- కొత్త కార్మిక చట్టాలు అములోకి వస్తే, ఆఫీస్ పని వేళలు మార్చుకోడానికి కంపెనీలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుతం మూడు షిఫ్ట్ లుగా ఉన్న పనివేళలను మార్చుకోవచ్చు. రెండు షిఫ్ట్ లను మాత్రమే పెట్టొచ్చు. దీనికి తగ్గట్టుగా ఉద్యోగులకు అదనపు సెలవలు ఇస్తారు. అంటే వారంలో పనిగంటలు స్థిరంగా ఉంటాయి, సెలవలు పెరుగుతాయి.
- పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఓవర్ టైమ్ గంటల సంఖ్య గతంలో 50 ఉండగా.. ఇప్పుడవి 125 గంటలకు పెంచుకోవచ్చు.
- ప్రైవేటు రంగంలోనివారికి టేక్ హోమ్ జీతం తగ్గే అవకాశముంది. కంట్రిబ్యూషన్ పెన్షన్ ని పెంచుకోవడం ద్వారా ఇలా టేక్ హోమ్ జీతం తగ్గుతుంది.
- ఇక పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం కూడా పెరిగే అవకాశముంది.
- రిటైర్మెంట్ సమయంలో పొందే సెలవులను ఎన్ క్యాష్ చేసుకోవడం, లేదా అంతకు ముందు ఏడాది ఉన్న సెలవలను, తర్వాతి ఏడాదికి కొనసాగించుకోవడం లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి.
- అయితే చట్టాలు మారినా సెలవలు మాత్రం మారవు. వీక్లీ ఆఫ్ లు కాకుండా.. ప్రతి 20రోజులకు ఒక క్యాజువల్ లీవ్ ఉంటుంది.
అంటే నెలరోజులకి ఒకటిన్నర రోజుల క్యాజువల్ లీవ్ ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: