ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి రాజకీయ పరిణామాలు వివరించటం పొత్తుల విషయాన్ని ప్రస్తావించేందుకు ఢిల్లీ వెళ్ళిన జనసేన అధినేత పవన్ ను కలిసేందుకు బీజేపీ అగ్రనేతలు ఇష్టపడలేదు.ఇక రెండు రోజులు వెయిట్ చేసినా కూడా నరేంద్ర మోడీ అమిత్ షా తో భేటీ సాధ్యం కాకపోవడంతో చేసేదిలేక అగ్రనేతలకు దగ్గరగా ఉండే వారితో సమావేశమై పవన్ కళ్యాణ్ వెనక్కు వచ్చేశారు. మొదటినుండి కూడా బీజేపీలోని ఢిల్లీ నేతల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నది ఎక్కవగా సునీల్ ధియోదర్ తో మాత్రమే.ఆ ధియోదర్ తప్ప పవన్ను మరేనేతలు పెద్దగా ఎంటర్ టైన్ చేయటంలేదు. అందుకనే ఇపుడు కూడా ఆయనతోనే పవన్ కళ్యాణ్ భేటీ అయి రాష్ట్రంలోని పరిస్ధితులు వివరించారని సమాచారం.పనిలోపనిగా పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటించిన మూడు ఆప్షన్ల విషయాన్ని కూడా ముందుగా ఢిల్లీ భేటీలో సునీల్ కు వివరించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ విషయంపైన చర్చించేందుకే తాను ఢిల్లీ వచ్చానని కాబట్టి ప్రధాని మోడి లేదా అమిత్ షా తో అపాయిట్మెంట్ ఇప్పించాలని కోరారట.


అయితే ఇక వాళ్ళద్దరి అపాయిట్మెంట్ ఇప్పించటం ధియోదర్ స్ధాయికి మించిన పనిగా తేలిపోయింది. ఢిల్లీలో ఎన్నిరోజులు కూర్చున్నా కూడా ఉపయోగం లేదని అర్ధమైపోవటంతో చేసేదిలేక ఆ మూడు ఆప్షన్లపైన ధియోదర్ తోనే చర్చించి పవన్ కళ్యాణ్ వెనక్కువచ్చేశారు. రాష్ట్రవ్యవహారాలకు సంబంధించి ధియోదర్ తో మాట్లాడితే ఎలాంటి ఉపయోగం అనేది ఉండదని పవన్ కళ్యాణ్ కు ఇంకా తెలియకపోవటమే చాలా విచిత్రంగా ఉంది.ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సింది ప్రధాని మోడి షా మాత్రమే. గతంలోనే రాష్ట్రంలోని కొందరు నేతలకు మద్దతుగా ధియోదర్ వ్యవహరిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కు పూర్తిస్ధాయి మద్దతు పలుకుతున్నట్లు మోడి షా కు రాష్ట్రంలోని కొందరు నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. ఇక ఇంత కీలకమైన మూడు ఆప్షన్లు ఇచ్చే విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలోని అగ్రనేతలు అపాయిట్మెంట్ ఇవ్వలేదంటే అర్ధమేంటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: