తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ గత కొంత కాలం నుంచి సరైన ఆదాయం లేక నష్టాల్లో కూరుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరికొత్తగా ఆదాయ మార్గాల కోసం వెతుకులాట ప్రారంభించింది. అయితే టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా.. ఇక ఆర్టీసీ రూపురేఖలను మార్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. ఇటీవల కాలంలో ఎన్నో అసౌకర్యాల నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో.. ఇక ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ ను ప్రజలందరికీ మరింత చేరువ చేసేందుకు నడుంబిగించారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.



 ఇలా ఏకంగా టిఎస్ ఆర్టిసి ఎండి స్థాయిలో ఉన్నప్పటికీ తరచూ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికుల ఇబ్బందులను అసౌకర్యాలను తెలుసుకుంటూ ఇక మార్పు వైపు అడుగులు వేస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోతున్న ఆర్టీసీ సంస్థ ను మళ్లీ లాభాల బాట పట్టించేందుకు వినూత్న ప్రయత్నాలు మొదలు పెట్టారు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్. ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకునేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సిద్ధమైంది..



 ఇప్పటికే కార్గో సర్వీసులను అందరికీ మరింత దగ్గర చేసి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది అన్న విషయం తెలిసిందే.  కాగా ఇప్పటికే ఫుడ్స్, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన సరుకులను కూడా కార్గో సర్వీసుల  ద్వారా రవాణా చేయడం లాంటివి చేస్తూ ఉంది టీఎస్ ఆర్టీసీ సంస్థ. ఇక ఇప్పుడూ ఆగు సర్వీసుల ద్వారా మరింత ఆదాయాన్ని పెంచుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ కాలేజీలతో పాటు జిల్లా మండల కేంద్రాలకు ఇంటర్ డిగ్రీ పాఠ్య పుస్తకాలను కూడా రవాణా చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తెలుగు అకాడమీ తో టి ఎస్ ఆర్ టి సి ఒప్పందం కుదుర్చుకుంది అన్న విషయం తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: