వచ్చే ఎన్నికల్లో గెలుపుపై చాలా లెక్కలే వేసుకుంటున్న చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు కేసాయార్ రూపంలో పెద్ద గండమే ఎదురయ్యేట్లుంది. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోతే జగన్మోహన్ రెడ్డే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే జగన్ కే లాభమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పష్టమైన అభిప్రాయంతోనే ఉన్నారు. జగన్ వ్యతిరేకతతోనే తామిద్దరు కలవకతప్పదని వీళ్ళద్దరికీ బాగా తెలుసు.





కాకపోతే తాజా పరిణామాల్లో జనసేనతో పొత్తుకు పవన్ మూడు ఆప్షన్లు ఇవ్వటం, దానిపై ఇటు బీజేపీ అటు టీడీపీ నేతలు మండిపడటం అందరు చూస్తున్నదే. సరే వీళ్ళ గోల ఎలాగున్నా పిల్లిపోరు పిల్లిపోరు పిట్ట తీర్చిందన్నట్లుగా పరిస్దితులు తయారవుతున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పేరుతో కేసీయార్ జాతీయపార్టీ ఏర్పాటుచేయబోతున్నారు. ఆ పార్టీకి జాతీయహోదా దక్కాలంటే కేంద్ర ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు ఫిట్ అవ్వాలి.





మార్గదర్శకాల్లో ఫిట్ అవ్వాలంటే మూడు, నాలుగు రాష్ట్రాల్లో పోటీచేయకతప్పదు. జాతీయపార్టీగా గుర్తింపు రావాలంటే  లోక్ సభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో 2 శాతం సీట్లు గెలిచుండాలి. లేదూ సాధారణ ఎన్నికల్లో మూడు గానీ లేదా నాలుగు రాష్ట్రాల్లో కలిపి 6 శాతం ఓట్లు తెచ్చుకోవాలి. ఇప్పటికిప్పుడు నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లంటే మామూలు విషయంకాదు.





అందుకని కచ్చితంగా ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలో పోటీచేస్తేకానీ ఓట్లు తెచ్చుకోలేందు. ఏపీలో సంగతి ఎలాగున్నా తెలంగాణాలో మ్యాగ్జిమమ్+కర్నాటక, మహారాష్ట్రలో గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకుంటేనే  బీఆర్ఎస్ కు జాతీయపార్టీ హోదా దక్కుతుంది. ఏపీలో బీఆర్ఎస్ కు ఓట్లు పడతాయని అనుకునేందుకులేదు. అయితే ఎన్నోకొన్ని ఓట్లయితే పడే అవకాశముంది. ఇక్కడే చంద్రబాబు, పవన్ కు ఇబ్బందులు మొదలవుతాయి. ఏపీలో కేసీయార్ పాలనను మెచ్చుకునే వాళ్ళెవరైనా ఉంటే అలాంటి వాళ్ళు బీఆర్ఎస్ కు ఓట్లేసే అవకాశముంది. అలా పడే ఓట్లు టీడీపీ, జనసేనకు మైనస్సే కదా. అంటే కేసీయార్ రూపంలో చంద్రబాబు, పవన్ కు గండం పొంచున్నట్లే కదా. చివరకు ఏమవుతుందో ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: