వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన మూడు ఆప్షన్లు ఎంత సంచలనంగా మారిందో అందరు చూస్తున్నదే. వచ్చే ఎన్నికల్లో బీజేపీని మోయటానికి పవన్ కు ఏమాత్రం ఇష్టంలేదు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపెట్టుకుని ఎన్నికలను ఎదుర్కోవాలన్నది పవన్ ప్లాన్. అలాగని బీజేపీని వదిలేసి టీడీపీతో వెళ్ళేంత ధైర్యం చేయలేకపోతున్నారు.






ఇదే సమయంలో పవన్ తో పొత్తు పెట్టుకునే విషయంలో చంద్రబాబు వెనకాడుతున్నట్లు తమ్ముళ్ళ మాటలను బట్టి అర్ధమవుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే ఇటు బీజేపీ అటు టీడీపీకి షాకిచ్చే ఉద్దేశ్యంతో పవన్ మూడు ఆప్షన్లు ప్రకటించారు. అయితే రెండుపార్టీలు ఆ ఆప్షన్లను చాలా లైటుగా తీసుకున్నాయి. ఇక్కడే 2019 ఎన్నికల్లో పవన్ విషయంలో జనాల ఆప్షన్పై చర్చ మొదలైంది.






2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీచేశారు. రెండు నియోజకవర్గాల్లో తన గెలుపు ఖాయమన్న ఉద్దేశ్యంతోనే పవన్ పోటీచేశారు. అయితే పవన్ విషయంలో జనాలు మాత్రం ఒకటే ఆప్షన్ ఇచ్చారు. అదేమిటంటే రెండుచోట్లా ఓడించటం. పవన్ అన్నా పై రెండుపార్టీలకు మూడు ఆప్షన్లిచ్చారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం జనాలు పవన్ కు కేవలం ఒకటే ఆప్షన్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.






అప్పట్లో జనాలిచ్చిన ఆప్షన్ను ఇప్పటికీ పవన్ మరచిపోలేకపోతున్నారు. అందుకనే తనను ఓడించటంపై  పదే పదే జనాలకు శాపనార్ధాలు పెడుతున్నారు. జనాల దృష్టిలో పవన్ కున్న ఆప్షన్ ఏమిటనేది ఎప్పుడో స్పష్టమైపోయింది. మరి వచ్చే ఎన్నికల్లో జనాలు పవన్ కు ఎలాంటి ఆప్షన్ ఇవ్వబోతున్నారనేది ఆసక్తిగా మారింది. అసలు తాను ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయాన్ని కూడా పవన్ ప్రకటించలేకపోతున్నారు. పవన్ మనసులో ఏముందో తెలీదుకానీ జనసైనికులు మాత్రం పవన్ను తిరుపతి, మళ్ళీ గాజువాక, భీమవరం, భీమిలి, కాకినడ నియోజకవర్గాల్లో పోటీచేయాలని డిమాండ్లు చేస్తున్నారు. మరి పవన్ ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు ? అక్కడి జనాల ఆప్షన్ ఏమిటనేది చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: