రాష్ట్రపతి ఎన్నికల్లో నాన్ ఎన్డీయే పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక కోసం జరిగిన సమావేశాన్ని ముఖ్యమంత్రులు లైటుగా తీసుకున్నట్లుంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలోని కాన్స్ స్టిట్యూషనల్ క్లబ్ లో కీలకమైన సమావేశం జరిగింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలు 22 మందిని మమత ప్రత్యేకంగా ఆహ్వనించారు. అయితే ఈ సమావేశానికి ఏ ముఖ్యమంత్రి కూడా హాజరుకాలేదు.





రాజస్ధాన్, పంజాబ్, ఢిల్లీ, తెలంగాణా, ఛత్తీస్ ఘర్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, కేరళ ముఖ్యమంత్రులను మమత ప్రత్యేకంగా పర్సనల్ గా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. అయితే వీరిలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా హాజరుకాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. చూస్తుంటే ముఖ్యమంత్రులందరు మమత నిర్వహించిన సమావేశాన్ని చాలా లైటుగా తీసుకున్నట్లున్నారు. ఎందుకంటే నాన్ ఎన్డీయే పార్టీలు ఎంతగా అవస్తలు పడినా ఉమ్మడి అభ్యర్ధి గెలుపుకు దాదాపు అవకాశంలేదు.





ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలో పోటీ జరిగితే బలాబలాలు చాలా తక్కువలో మాత్రమే ఉంది. ఎన్డీయే కూటమి బలం యూపీఏ, నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ కూటమి బలంతో పోల్చుకుంటే 1.2 శాతం ఓట్లు మాత్రమే వెనకబడుంది. నాన్ ఎన్డీయే, నాన్ ఎన్డీయే పార్టీల్లో  టీఆర్ఎస్, వైసీపీ, బీజూ జనతాదళ్ కీలకమైనవి. వీటిల్లో ఏ ఒక్క పార్టీ ఎన్డీయేకి మద్దతుగా నిలబడినా బలాబలాల్లో తేడా వచ్చేస్తుంది. పై మూడు పార్టీలు గనుక ఎన్డీయేకి వ్యతిరేకంగా నిలబడితేనే నాన్ ఎన్డీయే అభ్యర్ధి గెలుపుకు అవకాశముంది.





ఇపుడు మమత నేతృత్వంలో హాజరైన పార్టీలన్నీ ఏకతాటిపై నిలబడినా ఉపయోగంలేదు. ఎందుకంటే ఈ పార్టీల్లో చాలావాటికి ఎంపీల, ఎంఎల్ఏల బలం చాలా తక్కువ. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీయార్, బీజూ జనతాదళ్ అధినేత, సీఎం నవీన్ పట్నాయక్ తటస్తంగా ఉంటారని అనుకుంటున్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్డీయే అభ్యర్ధికే మద్దతుగా నిలబడే అవకాశముంది. కాబట్టి ఇన్నిపార్టీలు ఎంతగా పోరాడినా ఉపయోగం ఉండదు. ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత ముఖ్యమంత్రులందరు మమతను లైటుగా తీసుకుని సమావేశానికి గైర్హాజరైనట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: