అటుతిరిగి ఇటుతిరిగి చివరకు బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పినరయి విజయన్ ముణిపియేట్లున్నారు. దాదాపు రెండేళ్ళక్రితం బయటపడిన 30 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో 16 మాసాలు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే బయటకు వచ్చిన స్వప్నసురేష్ కీలకమైన వ్యక్తి. ఈమె ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారుల విచారణలో తాజాగా పినరయి, ఆమె భార్య కమల, కూతురు వీణ,  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్, విశ్రాంత చీఫ్ సెక్రటరీ నళినీ నెట్టో తదితరులున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది.





రెండేళ్ళక్రితం యూఏఈ నుండి కేరళలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వచ్చిన ఒక పార్శిల్లో బంగారం కడ్డీలు బయటపడ్డాయి. మామూలుగా యూఏఈ నుండి కేరళ, త్రివేండ్రంలోని కాన్సులేట్ జనరల్ ఆఫీసుకు రెగ్యులర్ గా అనేక పార్శిళ్ళు వస్తుంటాయి. రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం వచ్చి, వెళ్ళే పార్శిళ్ళను ఎవరు చెక్ చేయకూడదు. అయితే అప్పుడు వచ్చిన పార్శిల్ ను మాత్రం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓపెన్ చేయాలని పట్టుబట్టారు.





అలా పట్టుబట్టి ఓపెన్ చేసిన పార్శెల్లో 30 బంగారం బార్లు బయటపడ్డాయి. దాంతో ఎప్పటినుండో యూఏఈ నుండి కేరళకు దౌత్యమార్గాల్లో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందనే విషయం బయటపడింది. ఈ మొత్తానికి సూత్రధారి స్వప్నాసురేష్ అని బయటపడింది. ఇంతకీ స్వప్న ఎవరంటే కాన్సుల్ జనరల్ ఆఫీసులో పనిచేస్తున్న పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలో ఉద్యోగి. ఈమె చాలాకాలం యూఏఈలో పనిచేశారు. అరబిక్ అనర్ఘళంగా మాట్లాడగలరు కాబట్టే అక్కడి నుండి వచ్చేసి  కేరళలోని కాన్సులేట్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఎప్పుడైతే స్మగ్లింగ్ కేసులో పట్టుబడిందో వెంటనే పినరయి సాయంతోనే తాను ఇదంతా చేస్తున్నట్లు చెప్పేశారు.






స్మగ్లింగ్ బయటపడినపుడు పినరయి సొంతంగా పర్యవేక్షిస్తున్న ఐటిశాఖలోని ఓ ప్రాజెక్టులో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా కూడా స్వప్న బాధ్యతలు చూస్తున్నారు. దాంతో స్వప్న చెప్పిన విషయాలు బాగా సంచలనంగా మారాయి. మొత్తానికి ఈ కేసును దర్యాప్తుచేస్తున్న ఎన్ఐఏ తొందరలోనే పినరయితో పాటు ఆయన కుటుంబాన్ని కూడా ఇంటరాగేట్ చేయబోతోందని సమాచారం. మొత్తానికి పినరయి బంగారం స్మగ్లింగ్ లో బాగానే ఇరుక్కున్నట్లున్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: