సార్వత్రిక ఎన్నికల కంటే తీవ్ర స్థాయి చర్చ ఇప్పుడు భారత్ లో జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రతిపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అధికార పార్టీలో కూడా కాస్త భయం ఉన్నా.. ప్రతిపక్షాలు ఏకం కాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ దశలో అసలు రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికి ఉంటుంది. ఎన్డీఏకి జగన్ తలొంచుతారా..? లేక ప్రతిపక్షాలతో కలసి కేంద్రంపై ఒత్తిడి తెస్తారా..? అసలేం జరుగుతుంది..? రాష్ట్ర పతి ఎన్నికలను అడ్డు పెట్టుకుని ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునే అవకాశముందా..?

భారత రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సరైన అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో అటు అధికార  పరక్షం కూడా దీర్ఘాలోచనలో ఉంది, ఇటు వారి అభ్యర్థిని చూసి, తాము వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దేశంలో బీజేపీ యేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయినా ఫలితం లేదు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో ముడి పడలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు, వైసీపీ మద్దతుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మా మద్దతు ఎవరికంటే..?
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఏ అభ్యర్థికి మద్దతివ్వాలనే విషయంలో సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు విజయసాయిరెడ్డి. ప్రతిపక్షం ఉమ్మడి అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదని చెప్పారు విజయసాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ప్రస్తుతానికి వైసీపీ.. ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తుందని అనుకుంటున్నారంతా. ఇటీవల కాలంలో పార్లమెంట్ లో కూడా ఎన్డీఏ తీసుకునే నిర్ణయాలకే జగన్ మద్దతిచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అదే పద్ధతి ఫాలో అవుతారని అనుకుంటున్నారు. అయితే జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటారా..? అసలాయన వ్యూహం ఏంటి అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: