ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకీ హీటెక్కుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం వరకు సాఫీగా సాగిన పాలన కాస్తా... రెండవ సంవత్సరం నుండి అధికార ప్రభుత్వంపై వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి.. ఇసుక ధరలు పెరగడం, మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో చేయకపోవడం, రాష్ట్రంలో అసలైన అభివృద్ధి జరగకపోవడం లాంటి ఎన్నో కారణాలు జగన్ మరియు ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి దొహదపడ్డాయి. దీనితో వచ్చే ఎన్నికల్లో వీటిని ఉపయోగించుకుని ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ వ్యతిరేక పార్టీలు అన్నీ కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ విపక్షాలకు లీడర్ గా చంద్రబాబు నాయుడు ఉండి నడిపిస్తున్నాడు.

అయితే తెరముందు మాత్రం ఇంకా పొత్తుల గురించిన పలు నాటకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. కానీ రాజకీయ విశ్లేషకుల సమాచారం ప్రకారం టీడీపీ - జనసేన - బీజేపీ లు కలిసి వైసీపీని దెబ్బ తీయాలని ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. కాగా చంద్రబాబు ఈసారి కనుక గెలవకపోతే ఇక రాజకీయంగా పుంజుకోవడం కష్టమేనని బయట వినిపిస్తున్న మాట. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇక్కడ చంద్రన్న ఒక మిస్టేక్ చేస్తున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు. ప్రజల్లోకి చంద్రబాబు లేదా లోకేష్ లలో ఎవరో ఒకరే వెళ్లి తమ వాణిని గట్టిగా వినిపిస్తున్నారని... ఇక గతంలో అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు గొంతెత్తి అరిచినా నాయకులు ఎవరూ లేరా? వారెందుకు ఇప్పుడు ముందుకు వచ్చి పార్టీ తరపున మాట్లాడడం లేదు అంటూ విమర్శిస్తున్నారు.

కనీసం నియోజకవర్గంలో కూడా ఎవ్వరూ అంత ప్రభావంతంగా పని చేయకపోవడం చంద్రబాబుకు మైనస్ గా మారుతుందని అంటున్నారు. మరి చంద్రన్న పర్యటనలను పక్కకు పెట్టి... అందరి నేతలను పలు మార్లు సమావేశ పరిచి వారికి వారు బాధ్యత తీసుకుని పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చే లాగా చేయగలిగితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: