ప్రతిపక్షాలను చిత్తుచేయటంలో ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో జగన్మోహన్ రెడ్డిది డిఫరెంట్ స్టైల్. గడచిన మూడేళ్ళల్లో ఇటు చంద్రబాబునాయుడు అటు పవన్ కల్యాణ్ ను ఎప్పటికిప్పుడు ప్రతి విషయంలోను కార్నర్ చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. తాజాగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ పెరిగిపోతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో తెలీదు కానీ అన్నీ పార్టీలు ముందస్తు ఎన్నికలకు అయితే రెడీ అయిపోతున్నాయి.





సరిగ్గా ఇదే అంశంపై జగన్ ప్రతిపక్షాలకు పెద్ద షాక్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికలకు ముందుగానే తన అభ్యర్ధులను ప్రకటించాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఎన్నికలకు పదిమాసాలు ఉండగానే అభ్యర్ధులను ప్రకటించటమంటే మామూలు విషయంకాదు. ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ తన అభ్యర్ధిని ప్రకటించిందంటే మిగిలిన పార్టీల మీద ఆటోమేటిక్కుగా ఒత్తిడి పెరిగిపోతుంది. తమ అభ్యర్ధుల ప్రకటన ఎప్పుడని నియోజకవర్గాల్లో జనాలు తమ పార్టీల వెంటపడతారు. 





పలానా పార్టీ తరపున అభ్యర్ధిని ప్రకటించినపుడు మీ పార్టీ అభ్యర్ధిని ఎందుకు ప్రకటించటం లేదంటు మీడియా అడుతుతుంది అలాగే జనాల్లో కూడా చర్చలు మొదలైపోతాయి. ఇది ప్రత్యక్షంగా మిగిలిన పార్టీల మీద ఒత్తిడి పెంచేస్తుంది. ఇపుడు జరుగుతున్న గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమం జరుగుతున్న తీరును జగన్ చాలా నిశితంగా గమనిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోను ఎంఎల్ఏల వ్యవహార సరళిని గమనించేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం చాలా క్లోజ్ గా ఫాలో అవుతున్నారట.





ఈ బృందంనుండి ఎప్పటికప్పుడు రిపోర్టులు జగన్ కు అందుతున్నాయని సమాచారం. అందుకనే ఈ కార్యక్రమంలో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయించబోతున్నట్లు చెప్పారు. కాబట్టి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్లివ్వాలి, ఎవరికి కోతపెట్టాలనే విషయంలో జగన్ కు క్లారిటి వచ్చిందట. కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని జగన్ అనుకుంటే వెంటనే అభ్యర్ధులను ప్రకటించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. జగన్ నిజంగానే ఇలాచేస్తే ప్రతిపక్షాలు ఇబ్బందుల్లో పడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: