కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.అతి త్వరలో డిఏ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డీఏ సహా మూడు కీలకమైన అంశాలపై కూడా కేంద్రం జూలై నెలలో నిర్ణయం తీసుకోనుంది.ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చక్కటి గుడ్‌న్యూస్. త్వరలోనే అంటే ఈ జూలై నెలలో కేంద్రం మూడు కీలక విషయాలపై నిర్ణయం తీసుకోనుంది. డీఏ 5 శాతం పెంపు, 18 నెలల ఎరియర్స్ ఇంకా అలాగే పీఎఫ్ వడ్డీ రేటు జమ చేయడంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జూలై నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ త్రిపుల్ బొనాంజా అనేది తగలనుంది.ఇక జూలై నెల నుంచి డీఏ 5 శాతం పెరగవచ్చని ఆల్ ఇండియా సీపీఐ ఐడబ్ల్యూ డేటా చెబుతోంది. డీఏ పెంపు నిర్ణయం కోసం లక్షలాదిమంది ఉద్యోగులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. ఏప్రిల్ నెల ఏఐసీపీ ఇండెక్స్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే జూలై నెల నుంచి ఈ డీఏ అనేది పెరగవచ్చు.


ఈ జూలై నెలలోనే ప్రభుత్వం ఉద్యోగులకు మరికొన్ని శుభవార్తలు విన్పించనుంది. డీఏ 5 శాతం పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మొత్తం 39 శాతానికి చేరుకోనుంది. ఇక వాస్తవానికి డీఏ 4 శాతం పెంచవచ్చని భావించారు.అలాగే మరోవైపు 18 నెలల పెండింగ్ డీఏ కూడా జూలై నెలలోనే చెల్లించవచ్చని సమాచారం తెలుస్తోంది. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకూ కూడా అంటే 18 నెలల డీఏను చెల్లించనుంది. ఇది అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏ రూపంలో దాదాపుగా రెండేసి లక్షల రూపాయలు వస్తాయి. అలాగే మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది ఈపీఎఫ్ వడ్డీను 8.1 శాతంగా ప్రకటించింది.ఇక 2021-22 ఏడాదికి ఈ వడ్డీ వర్తించనుంది.పీఎఫ్ పై వడ్డీ డబ్బులు కూడా జూలై నెలలోనే పడే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: