ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వైఖరి, ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఏడాది పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనల కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. ఏడాదిలో వంద నియోజకవర్గాల్లో రోడ్డుషోలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. మొదటి కార్యక్రమం అనకాపల్లి జిల్లాతో మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు పెట్టిన పేరు ఏమటంటే ‘ఎన్టీయార్ స్పూర్తి-చంద్రబాబు భరోసా’ .






ఇక్కడే చంద్రబాబు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. అదేమిటంటే  ఎన్టీయార్ ను చంద్రబాబు ఏ విషయంలో స్పూర్తిగా తీసుకున్నారో అర్ధం కావటంలేదు. వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీని కూడా లాగేసుకున్నదే చంద్రబాబు. అసలు ఎన్టీయార్ పార్టీని పెట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. అలాంటిది పార్టీని, పదవిని లాగేసుకున్నదే కాకుండా కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్నది చంద్రబాబే. మరి ఎన్టీయార్ నుండి చంద్రబాబు ఎందులో స్పూర్తిపొందినట్లు ? తాను సీఎం కాగానే కొంతకాలం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాల్లో కూడా ఎన్టీయార్ బొమ్మను తొలగించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.





ఇక చంద్రన్న భరోసా గురించి మాట్లాడాలంటే ఎవరికి చంద్రన్న భరోసా దక్కిందో అర్ధం కావటంలేదు.  2014లో అధికారంలోకి రావటంకోసం ఆచరణసాధ్యంకాని అనేక హామీలిచ్చింది చంద్రబాబే. అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేశారు. సరే ఐదేళ్ళ పరిపాలన తర్వాత ఎన్నికలొస్తే జనాలు టీడీపీకి 23 సీట్లిచ్చి మూల కూర్చోబెట్టారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంత తక్కువ సీట్లొచ్చాయటేనే చంద్రబాబు పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధమైపోయింది.






ఐదేళ్ళ పాలనలో ఏ వర్గానికి భరోసా ఇచ్చున్నా టీడీపీ అంత ఘోరంగా ఓడిపోయుండేదికాదు. అధికారంలో ఉన్నపుడు మామూలు జనాలగురించి ఆలోచించకుండా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తనకుమాత్రమే జనాలపైన అపారమైన ప్రేమున్నట్లు, తాను బతుకుతున్నదే దీనజనోద్ధరణ కోసమన్నట్లు మాట్లాడుతున్నారు. మొత్తానికి తాజాగా ప్రారంభించిన కార్యక్రమానికి ఎన్టీయార్ స్పూర్తి-చంద్రన్న భరోసా అని పేరు పెట్టడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. కార్యక్రమంలోని పేరు ఏమాత్రం సూట్ కాదని తెలీసీ ఆ పేరు పెట్టారంటేనే చంద్రబాబు నైజం అర్ధమైపోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: