ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డును తప్పనిసరిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకే దేశం ఒకే కార్డు అనే నినాదంతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకువచ్చిన సరికొత్త ఆలోచన చేస్తే.. అది దేశవ్యాప్తంగా ప్రభంజనం గా   పాకిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో ఒక పౌరుడు జీవిస్తున్నాడు అన్నదానికి గుర్తింపుగా ఆధార్ కార్డు ప్రామాణికంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కావాల్సిన కీలకమైన డాక్యుమెంట్ లలో ఆధార్ కార్డు కూడా ఒకటిగా మారిపోయింది.


 ఒక రకంగా చెప్పాలంటే ఆధార్ కార్డు లేనిదే ప్రస్తుతం ఎవరూ కూడా ఏ పని పూర్తి  చేయలేరేమో అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు విషయంలో కీలక ముందడుగు వేసేందుకు ప్రస్తుతం ప్రభుత్వం సిద్ధమవుతోంది అనేది తెలుస్తుంది. ఆసుపత్రిలో శిశువు పుట్టిన వెంటనే ఆ పసికూన లకు కూడా ఆధార్ కార్డు నెంబర్ కేటాయించేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి, జహీరాబాద్ లోని ఆస్పత్రులలో ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే అప్పుడే పుట్టిన శిశువులకు వేలిముద్రలు ఎలా వస్తాయి అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ పుట్టిన చిన్నారుల తల్లి వేలిముద్రలు తీసుకుని శిశువు ఫోటో  అప్లోడ్ చేసి తాత్కాలిక ఐడి క్రియేట్ చేస్తారట.


 ఇక దీనికోసం పైలెట్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలను సెలెక్ట్ చేసినట్టు వైద్య అధికారులు తెలిపారు. ఇక ఆ తర్వాత ఎన్రోల్మెంట్ ఐడి ఆధారంగా 45 రోజుల తర్వాత మీ సేవా కేంద్రాల్లో శిశువు పేరు నమోదు చేసి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందట. మరోవైపు ఐదేళ్లలోపు చిన్నారులకు ఇంటి వద్ద ఆధార్ కార్డు సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పోస్టల్ శాఖ ఉద్యోగులు ఇంటి వద్దకు చేరుకొని అన్ని రకాల వివరాలు సేకరించి ఇక ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. ఇలా రోజు రోజుకి ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ మరింత సులభతరం అవుతూ ఉండడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: