వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణాలో అధికారంలోకి రావాల్సిందే అని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందుబాటులో ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిరోజు కేసీయార్ కు వ్యతిరేకంగా ఏదో రచ్చ చేస్తు జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. చాలాసార్లు కేసీయార్ పైనే కమలనాదులు మైండ్ గేమ్ ఆడుతున్నారు.  పార్టీపరంగా ఏదో కార్యక్రమాన్ని పెట్టుకుని కేంద్రం మంత్రులను వరుసగా తెలంగాణాకు రప్పిస్తున్నారు.





సరే ఇంతచేస్తున్నా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా ? సమస్యేలేదని అర్ధమైపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి అన్నిచోట్లా గట్టి అభ్యర్ధులు కూడా దొరకరన్నది నూరుశాతం నిజం. అన్నీచోట్లా గట్టి అభ్యర్ధులనే నిలపలేని పార్టీ మరి అధికారంలోకి ఎలా వచ్చేస్తుంది ? ఇక్కడే పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ లో ఉన్న గట్టి నేతలను బీజేపీలోకి ఆకర్షించటం. ఈ ఆకర్షణ కూడా ఎలాగుంటుంది మామూలుగా ఉండదట.





ముందుగా బీజేపీలోకి మారటానికి సిద్ధంగా ఉన్న గట్టి నేతలను ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడటం బీజేపీ తెలంగాణా చీఫ్ బండిసంజయ్ అండ్ కో బాధ్యత. అలా పార్టీలోకి వచ్చే వాళ్ళతో ఖాయమనుకున్న వాళ్ళని డైరెక్టుగా నరేంద్రమోడితో మాట్లాడించబోతున్నారట. కొంతమందిని నేరుగా ఢిల్లీకి తీసుకెళ్ళి అవసరమైన హామీలు ఇప్పించాలని డిసైడ్ అయ్యారట. దీనికి మోడి కూడా సానుకూలంగా ఉన్నారట. సుమారు ఓ 60 మందిని బీజేపీ లైనులో పెడుతున్నట్లు సమాచారం. 





ఈమధ్య బీజేపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు ఢిల్లీలో మోడిని కలవటం ఇందులో భాగమేనట. తెలంగాణాలో అధికారంలోకి రావాలన్న పట్టుదలగా ఉన్నారు కాబట్టి గట్టినేతలతో భేటీ అవటానికి మోడీకి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. మోడీనే స్వయంగా ఫోన్లో మాట్లాడటమో లేకపోతే డైరెక్టుగా వన్ టు వన్ భేటీ అయితే చాలామంది పై పార్టీల్లోని నేతలు బీజేపీలోకి జంప్ చేయటానికి అభ్యంతరం ఏముంటుంది ? అయితే అది ఇపుడే కాదు ఎన్నికలకు ముందు మాత్రమేనట. మరి బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏ మేరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: