ఇటీవల రేషన్ షాపుల్లో ఇస్తున్న బియ్యం ప్లాస్టిక్ బియ్యంలా ఉందని, వాటితో అన్నం వండితే ముద్ద ముద్దగా అవుతుందనే ఆరోపణలున్నాయి. అయితే అది ప్లాస్టిక్ బియ్యం కాదని, దాన్ని ఫోర్టిఫైడ్ బియ్యం అంటారని చెబుతున్నారు అధికారులు. ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలున్నాయని, వాటి తయారీకి ఖర్చు ఎక్కువ అవుతున్నా కేంద్ర ప్రభుత్వం భిరంచి, పేదలకోసం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తోందని చెబుతున్నారు.

ఇంతకీ ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి..?
సాధారణ బియ్యంలో ఎలాంటి పోషకాలు ఉండవు. కానీ వాటికి పోషకాలను సూక్ష్మంగా జతచేసి తయారు చేసేదే ఫోర్టిఫైడ్ రైస్. దానివల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, బి-12 లాంటి సూక్ష్మ పోషకాలను చాలా తక్కువ పరిమాణంలో బియ్యంతో జోడిస్తారు. ఇలాంటి పద్ధతిని ఫోర్టిఫికేషన్ అంటారు. ఈ పద్ధతిలో తయారు చేసిన బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ అని చెబుతారు. ఈ రైస్ సాధారణంగా మనం చూసే రైస్ లాగానే ఉంటాయి. కానీ అన్నం వండితే ముద్ద ముద్దగా అవుతాయి. అక్కడే కోంతమంది అపోహ పడుతున్నారు. అది ప్లాస్టిక్ బియ్యం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కానీ అది ప్లాస్టిక్ బియ్యం కాదని, అలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెబుతున్నారు అధికారులు.

ఫోర్టిఫైడ్ రైస్ లో ఉన్న సూక్ష్మ పోషకాలు 45రోజుల వరకు ఉంటాయి. ఆలోపే వాటిని తింటే వాటి వల్ల ఉపయోగాలు కలుగుతాయి. ఒకవేళ ఆలస్యం అయితే పోషకాలు పోతాయి, బియ్యం సాధారణంగానే ఉంటాయి. ఈ ఫోర్టిఫైడ్ రైస్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గుతుంది. బిడ్డల ఎదుగుదలకు కూడా రక్తహీనత అనేది ప్రధాన అవరోధంగా ఉంటుంది. దీనివల్ల పిల్లల ఎదుగుదల మందగిస్తుంది. అందుకే రక్తహీనత లేకుండా చేయాలంటే ఫోర్టిఫైడ్ బియ్యం తినాలి. ఐరన్ లోపం గ్రామీణ ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే ప్రభుత్వం పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రైస్ తినాలి. దీనిపై ఇప్పుడిప్పుడే అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: