పొత్తులపై ఇప్పుడే ఏమీ మాట్లాడను..ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. ప్రకాశం జిల్లాలోని పర్చూరులో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతులకు ఆర్ధికసాయం అందించేందుకు పవన్ పర్చూరులో పర్యటించారు. ఈ నేపధ్యంలో మీడియాతో మట్లాడుతు పొత్తుల విషయమై ఇపుడేమీ మాట్లాడనని చెప్పేశారు. ఒకవైపేమో దాదాపు రెండు నెలల క్రితమే పొత్తులపై ప్రస్తావన తెచ్చిన పవన్ ఇపుడు అదే పొత్తులపై మాట్లాడేందుకు ఎందుకు వెనకాడుతున్నట్లు ?






పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారమైతే వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో ఏమి నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాక పవన్ అవస్తలుపడుతున్నారట. మిత్రపక్షమైన బీజేపీతో కంటిన్యు అవటానికి పవన్ ఇష్టపడటంలేదు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపెట్టుకుని బీజేపీతో తెగతెంపులు చేసుకోవటానికి ధైర్యం సరిపోవటంలేదట. ఎన్నికలు రెండేళ్ళుండగానే బీజేపీతో తెగతెంపులు చేసుకుని చంద్రబాబునాయుడుతో చేతులు కలిపితే ఏమి సమస్యలు వస్తాయో అనే టెన్షన్ వెంటాడుతోందట.






జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే ఏకైక టార్గెట్ గా ఢిల్లీకి వెళ్ళి టీడీపీతో పొత్తుకు ప్రయత్నిస్తే బీజేపీ అగ్రనేతలు కుదరదు పొమ్మన్నారట. తమకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటం ఏమాత్రం ఇష్టంలేదని తేల్చేశారట. దాంతో ఏమీ చేయలేక, చేసేదిలేక హైదరాబాద్ కు తిరిగొచ్చేశారట. అందుకనే ఏమి చేయాలో పర్చూరుసభలో మాట్లాడుతు తనకు జనంతోనే పొత్తుకానీ పార్టీలతో కాదని విచిత్రమైన వ్యాఖ్య చేశారు. జనం సమస్యల కోసమే తాను నిలదీస్తానని గతంలో టీడీపీ, ప్రధానమంత్రిని కూడా నిలదీసినట్లు చెప్పారు.






నిజానికి చంద్రబాబును, నరేంద్రమోడిని ఏనాడూ పవన్ నిలదీసిందిలేదు. ఒకసారి చంద్రబాబు, లోకేష్ ను గుంటూరు సభలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. కానీ తర్వాత వాళ్ళపై ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదో అర్ధం కావటంలేదు. మోడి సర్కార్ ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నా కనీసం ఒక్కసారి కూడా నిలదీయలేకపోతున్నారు. వాస్తవం ఇలాగుంటే తానేదో ప్రజలకోసం ఎవరినైనా ఎదిరిస్తానని సొల్లుకబుర్లు చెప్పటమే విచిత్రం. పొత్తులపై ఒక్కోసారి ఒక్కోలాగ మాట్లాడుతున్న పవన్ తాజా మాటలు విన్నతర్వాత వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళబోతున్నారా అనే అనుమానాలు  కూడా మొదలయ్యాయి. చివరకు ఏమి చేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: