సాధారణంగా ప్రతి విద్యార్థి జీవితంలో అటు పదవతరగతి పరీక్షలు  ఎంతో కీలకమైనవి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి తమ చదువు నిరూపించుకునేందుకు పైచదువులకు వెళ్లేందుకు ఇక పదవ తరగతి పరీక్ష ప్రామాణికంగా మారుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క విద్యార్థి 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవాలని భావిస్తూంటారు. ఇక పదవ.తరగతి పరీక్షలు వచ్చాయంటే చాలు ఎన్నో రోజుల నుంచి పుస్తకాల పురుగులుగా మారిపోయి గంటల తరబడి ఇక చదవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు  ఇలా ఎంతో కష్టపడి చదివినప్పటికి కూడా కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు ఫెయిల్ అయిన సమయంలో  తల్లిదండ్రులు మందలించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రమైన ఘటన జరిగింది. అందరిలాగానే సదరు యువకుడు కూడా పదవతరగతి పరీక్షలు రాసాడు. అయితే 10వ తరగతి పరీక్షలలో అతను ఫెయిల్ అయ్యాడు. ఇందులో కొత్తేముంది కొంతమంది విద్యార్థులు పాసవుతారు కొంతమంది ఫెయిల్ అవుతారు అని అనుకుంటున్నారు కదా. అయితే ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే సదరు విద్యార్థి తండ్రి కూడా పదో తరగతి పరీక్ష పాస్ అయ్యాడు. విద్యార్తి మాత్రం ఫెయిల్ అవడం గమనార్హం.


 ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. పుణేకు చెందిన భాస్కర్ వాగ్మారే ఇటీవల తన కొడుకుతో కలిసి 10వ తరగతి పరీక్ష రాశాడు. ఇటీవలే 10 ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో  తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా పది ఫలితాలలో చెక్ చేసుకున్నారూ. కాగా తండ్రి భాస్కర్ పాస్ అయితే  కొడుకు మాత్రం పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు. ఏడో తరగతి తర్వాత కుటుంబ బాధ్యత మీదపడటంతో భాస్కర్ చదువు మానేశాడు. 30 ఏళ్ల తర్వాత తిరిగి కొడుకుతో కలిసి పరీక్షలు రాసి పాసయ్యారు. ఇలా తండ్రి 10వ తరగతి పరీక్షల్లో పాస్ అవడం కొడుకు అదే పరీక్షలలో ఫెయిల్ అవడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: