ఇటీవలి కాలంలో సోషల్ మీడియా అనేది కేవలం ఎంటర్ టైన్ మెంట్ పంచె ఒక ఫ్లాట్ ఫామ్ గా మాత్రమే కాకుండా ఎంతో మందికి అవగాహన కల్పించే ఒక ఆయుధంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే తాము చెప్పాలనుకున్నది ప్రతి ఒక్కరికి చేరడానికి ఇక సోషల్ మీడియాని ఆశ్రయిస్తున్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే కొంతమంది యువకులు కొన్ని విషయాలపై అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వినూత్న ప్రయత్నాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.


 సాధారణంగా కారు కొనడానికి వెళ్లిన సమయంలో ఎవరైనా సరే కార్ కంపెనీ ప్రతినిధులకు అటూ నోట్లు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఎంతో మంది ఏకంగా నాణాలను కార్ షో రూమ్ కి తీసుకువెళ్లి కారు కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు. అయితే నేటి రోజుల్లో పది రూపాయలు నాణాలను ఎవరు వాడటం లేదు.. అవి చెల్లవు అంటూ ఒక ప్రచారం జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. పది రూపాయల నాణెం చెల్లుతుంది అని ఆర్బీఐ అవగాహన కల్పించినప్పటికీ ఎంతోమంది పది రూపాయల నాణెం చెల్లదు అని గట్టిగా ఫిక్స్ అయిపోతున్నారు.



 ఇలాంటి వారికి అవగాహన కల్పించేందుకు ఇక్కడ ఒక యువకుడు నిర్ణయించాడు. అతడు కారు కొనుగోలు చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే ఆరు లక్షలు పెట్టి కారు కొన్నాడు. అయితే ఈ ఆరు లక్షల విలువచేసే పది రూపాయల నాణాలను  కార్ షో రూమ్ లోకి తీసుకు వెళ్లి ఆ నాణేల తోనే ఒక కారు కొనుగోలు చేసి ఈ వీడియోను సోషల్ మీడియా లో పెట్టాడు. తద్వారా ఇక పది రూపాయల నాణేలు చెల్లుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో రూపంలో అందరికీ అవగాహన కల్పించాడు. తమిళనాడులోని వెట్రివేల్ అనే వ్యక్తి పది రూపాయల నాణాలతో  ఆరు లక్షల మీద పోగు చేసి వాటితో కారు కొన్నాడు. అతని తల్లి నడుపుతున్న దుకాణంలో ఉన్న నాణేలకు మరి కొన్ని నాణాలను పోగుచేసి ఇక ప్రజలకు అవగాహన కల్పించాలని ఇలాంటి ప్రయత్నం చేశాడు ఈ యువకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: