గత కొంత కాలం నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అన్న విషయం తెలిసిందే. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉగ్ర చర్యలపై నిఘా పెట్టినప్పటికీ ఏదో ఒక విధంగా ఇక ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను కాల్చి చంపడం లేదా పోలీస్ అధికారులను హత్య చేయడం లాంటివి చేసి  ప్రజల్లో భయాందోళనలు పుట్టించడానికి  ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అటు భారత ఆర్మీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది.


 ఎక్కడ ఉగ్రవాదులు ఆగడాలు సాగకుండా ఎప్పటికప్పుడు వివిధ రకాల ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. నక్కి ఉన్న ఉగ్రవాదులను సైతం వెంటాడి వేటాడి చివరికి ఎన్కౌంటర్ చేసి హతమారుస్తూ ఉంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అటు ప్రజల నుంచి కూడా భారత ఆర్మీ కి మద్దతు తోడవడంతో అటు ఉగ్రవాదులు ఏరివేత కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఇండియన్ ఆర్మీ. గత కొన్ని నెలల నుంచి వందల మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే జమ్మూ కాశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.


 కుప్వారా, కుల్గాం జిల్లాలో వేరు వేరు ఎన్కౌంటర్లలో భద్రతా బలగాలు వీరిని మట్టి పెట్టినట్లు తెలుస్తుంది. మృతి చెందిన వారిలో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాది ఉన్నాడని.. ఇక లష్కరే-ఇ-తోయిబా సంస్థకు కోసం పని చేస్తున్నాడని అధికారులు గుర్తించారు. ఇక ఈ ఆపరేషన్లో భాగంగా షౌకత్ అహ్మద్ షేక్  అనే ఉగ్రవాదిని అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల శిబిరాలను చుట్టుముట్టిన సమయంలో ముష్కరులు కాల్పులు జరుపగా  భద్రతా సిబ్బంది దీటుగా బదులిచ్చారు. ఇక మరికొంతమంది ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఐజి విజయ్ కుమార్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: