దేశ వ్యాప్తం గా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రుతుపవనాల ప్రభావం తో గత మూడు రోజులు గా వాతావరణం చల్లబడింది. దేశ వ్యాప్థం గా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. రాబోయే ఐదురోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రా ల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనా లు చురుగ్గా కదులుతున్న నేపథ్యం లో ఉరుములు, మెరుపుల తో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాల కారణం గా వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రానున్న ఐదు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి తో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల పల్లి, నల్గొండ, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


మొత్తం దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యం లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా వరకు నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. ఇప్పటికే అస్సో లో భారీ వర్షాలు కురుస్తుండటం తో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు..ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: