ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో యాత్రలకు చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. మరో రెండేళ్లు ఎన్నికలకు సమయం ఉన్నా కానీ ముందస్తు కూడా వచ్చే అవకాశం ఉండటంతో ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు.ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్ర బాబు ఈ రెండేళ్లు జనంతోనే సావాసం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలాగే చంద్ర బాబుకు తోడుగా మరో ఇద్దరిని కూడా రంగంలోకి దింపి యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల వరకూ కూడా గ్యాప్ లేకుండా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆయన సిద్దమవతున్నారు. ఇక అపర చాణక్యుడు చంద్రబాబు ఇప్పటికే జన్నాల్లో ఉన్నాడు. అలాగే ఇక ఇదే రూట్ లో చినబాబు లోకేష్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.అయితే లోకేష్ బాబు వచ్చే అక్టోబర్ నెల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని చూసినా కూడా ఇప్పుడు జనసేన అదే ప్లాన్ తో ఉండటంతో మరో ప్లాన్ తో దీనికి ముందే అడుగులు వేయటానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. 


ఆగస్టు నెలలోనే ఈ యాత్ర ఉండొచ్చని అంటున్నారు. అలాగే దీంట్లో మార్పులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. అయితే ఇక ప్రజల్లోకి వెళ్లడానికి చినబాబు భారీ టార్గెట్ తో పాదయాత్ర చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను బీట్ చేసేలా నాలుగు వేల కిలోమీటర్లు అయినా సుదీర్ఘ పాదయాత్రగా చేయాలనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పాదయాత్ర జగన్ మోహన్ రెడ్డి ఇక రాయలసీమ జిల్లాల నుంచే మొదలుపెట్టాలని షెడ్యూల్ రెడీ చేపిస్తున్నారట. ఈ పాదయాత్రతో జనంలోకి వెళ్లి ఫోకస్ కావాలని భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక బాబు యాత్రలు జిల్లాల్లో ఎలాగూ ఉంటాయన్నది మనకు తెలిసిన విషయమే.ఒక ఏడాది పాటు ఇక జిల్లాల్లోనే గడపనున్నారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలను బస్సు యాత్రతో ఫినిష్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక అలాగే మరోవైపు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కూడా బాబు రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: