సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబుకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు మేజిస్ట్రేట్. హత్య కేసులో మే 23న అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జడ్జి ముందు హాజరు పరిచి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ ఖైదీగా తరలించారు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌ లోనే రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ గడువు ముగుస్తుండటంతో.. బెయిల్ కోసం ప్రయత్నించారు. ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే భద్రతా కారణాల వల్ల ఆయనకు సెక్యూరిటీగా ఎస్కార్ట్ కల్పించలేమని పోలీసులు జడ్జికి విన్నవించుకున్నారు. దీంతో అనంతబాబును ఆన్‌ లైన్‌ విధానంలో మేజిస్ట్రేట్ట ముందు హాజరు పరిచారు. వీడియా విచారణకు ఆయన్ను తీసుకొచ్చారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు జడ్జి నిరాకరించారు. జులై 1 వరకు అనంతబాబు రిమాండ్ ని పొడిగిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.

బెయిల్ ఇక రాదా..?
అనంతబాబు కి బెయిల్ రాకపోవడంతో ఆయన మరో 11రోజులపాటు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే బెయిల్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, డ్రైవర్ హత్య కేసులో అనంత బాబు నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందంటూ.. పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ కస్టడీ పిటిషన్ లో సమగ్ర వివరాలు లేవని జడ్జి ఆ పిటిషన్ ని రిజక్ట్ చేశారు. దీంతో జులై 1 వరకు ఆయనకు కస్టడీ కూడా కుదరజు, రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండాలి.

ఇక అనంతబాబు పొలిటికల్ కెరీర్ విషయానికొస్తే.. వైసీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కానీ ఇటీవల కొన్ని కార్యక్రమాలలో అనంతబాబు అభిమానులు ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేశారు. అయితే వైసీపీకి ఈ పాలాభిషేకాలతో సంబంధం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక ప్రతిపక్షాలు అనంతబాబుని ఎమ్మెల్సీగా అనర్హుడిని చేయాలంటూ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ కేవలం పార్టీనుంచే సస్పెండ్ చేసిందని, ఆయన్ను మండలి నుంచి కూడా సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: