చివరకు రాజుగారి పరిస్దితి ఇలాగైపోయిందన్నమాట. ఢిల్లీలో ఉండలేక ధైర్యంగా తన నియోజకవర్గానికి రాలేక వైసీపీ తిరుగుబాటు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నానా అవస్తలు పడుతున్నారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక తనకు సెక్యూరిటి ఇవ్వాలని, నియోజకవర్గంలోకి అడుగుపెట్టినపుడు తనపై కేసులు పెట్టకుండా అరెస్టు చేయకుండా రాష్ట్రపోలీసులకు ఆదేశాలివ్వాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ను బతిమలాడుకుంటున్నారు.





ఇంతకీ విషయం ఏమిటంటే జూలై 4వ తేదీన మన్యంవీరుడిగా ప్రఖ్యాతిచెందిన అల్లూరు సీతారామరాజు 125వ జయంతి జరగబోతోంది. ఈ సందర్భంగా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఈ కార్యక్రమానికి స్వయంగా నరేంద్రమోడీ హాజరవుతున్నారు. అదికూడా నరసాపురం నియోజకవర్గంలోనే కార్యక్రమం జరగబోతోంది. దాంతో ఎలాగైనా ఆరోజు ప్రధానమంత్రి కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.





తన నియోజకవర్గంలో మోడి పర్యటిస్తున్నపుడు తాను లేకపోతే ఎంతటి అవమానం. కాబట్టి తాను కూడా మోడీతో పాటు పాల్గొనాల్సిందే అని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అవ్వటంవరకు ఎంపీచేతిలోనే ఉంది కానీ పర్యటించే క్షేమంగా బయటపడే పరిస్దితులు లేవని ఎంపీకి బలమైన అనుమానం. అందుకనే తన పర్యటనలో పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయకుండా తగిన ఆదేశాలివ్వాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని బతిమలాడుకుంటున్నారు.





మరి కేంద్ర హోంశాఖ నుండి ఆదేశాలు రాకపోతే ఏమిచేస్తారో తెలీదు. అయినా జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిట్టడం ఎందుకు ? కేసులుపెడితే గోలచేయటం ఎందుకు ? జగన్ తో పడనప్పుడు పడనట్లే కామ్ గా ఉండుంటే సరిపోయేది. అలాకాదని ఎవరినో చూసుకుని నోటికొచ్చినట్లు తిట్టి, అనవసరమైన ఆరోపణలు చేసి, కోర్టుల్లో కేసులు వేసి ఏదో చేద్దామని అనుకున్న రాజుగారు చివరకు తానే ఏదో అయిపోతున్నారు. నేరచరిత్ర ఉన్నవారు ముఖ్యమంత్రి అవుతారని అంబేద్కర్ ముందే ఊహించలేకపోయారని ఇప్పుడు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. మరి బ్యాంకుల్లో వేలాది కోట్ల ప్రజాధనాన్ని అప్పుగా తీసుకుని దోపిడిచేసేవాళ్ళు చట్టసభల్లోకి వస్తారని కూడా  అంబేద్కర్ ఊహించుండరు కదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: