సంక్షోభంలో కూరుకుపోయిన మహారాష్ట్రలోని  మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం గంటకో మలుపు తిరుగుతోంది. అంతిమంగా ప్రభుత్వం కూలిపోతుందా లేకపోతే సంక్షోభంలో నుండి బయటపడుతుందా అన్నది ఇప్పుడే తేలేట్లులేదు. అయితే ఇందులో నుండి ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటుంది. అదేమిటంటే మంత్రులు, ఎంఎల్ఏలు లేదా పార్టీ సీనియర్ నేతలకు అందుబాటులో ఉండాలని.





తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏల్లో ఒకరు ముఖ్యమంత్రి ఉధ్థవ్ ఠాక్రేకి రాసిన తాజా లేఖే దీనికి ఆధారం. ఇంతకీ ఆ రెబల్ ఎంఎల్ఏ రాసిన లేఖలో ఏముందంటే తాము ఎన్నిసార్లు ఠాక్రేని కలవాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదట. ముఖ్యమంత్రి అపాయిట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా తీసుకోలేకపోయినట్లు చెప్పారు. ఎంఎల్ఏల్లో ఎవరికీ సీఎం అందుబాటులో ఉండటంలేదనేది ప్రధానమైన ఆరోపణ.





ముఖ్యమంత్రి ఇటు మంత్రులనూ కలవక అటు ఎంఎల్ఏకూ అందుబాటులో ఉండకపోతే ఇంక చేసేదేముంటుంది ? మంత్రులు, ఎంఎల్ఏలను కూడా కలవలేనంత బిజీగా సీఎం ఏమంత పనిలో ఉంటారు. ఉన్నతాధికారులతో రివ్యూలు, శాఖాపరమైన సమీక్షలు అవసరమే. అయితే ఇదే సమయంలో మంత్రులు, ఎంఎల్ఏలను కలవటం కూడా అవసరమే. ఎన్నిసార్లు ప్రయత్నించినా సీఎం కలవకపోవటంతో ఎంఎల్ఏలు ఏమిచేయాలి ? ఇదిగో ఇపుడు మహారాష్ట్రలో తిరుగుబాటు మొదలైనట్లే అవుతుంది.






జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇలాంటి ప్రచారమే జరుగుతోంది.  జగన్ తాను సీఎంగా ఉన్నారంటే అదికేవలం ఎంఎల్ఏల సంఖ్యాబలం వల్లమాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎన్నిపనులున్నా జగన్ కచ్చితంగా రోజుకు కొందరు ఎంఎల్ఏలను అయినా కలిసితీరాల్సిందే. ఇప్పటికిప్పుడు ఏపీలో కూడా మహారాష్ట్రలాగే తిరుగుబాటు మొదలవుతుందని ఎవరూ అనుకోవటంలేదు. అంత సీన్ కూడా లేదు. కానీ పరిస్ధితులు అక్కడిదాకా తెచ్చుకోకూడదని చెప్పటమే ఉద్దేశ్యం. తిరుగుబాటు మొదలై సీఎం సీటుకే ఎసరొచ్చిన తర్వాత తనతో ఎంఎల్ఏలు డైరెక్టుగా వచ్చి కలవాలని ఉధ్థవ్ ఇపుడు పిలుస్తున్నారు. ఈ బుద్ధేదో ముందే ఉండుంటే ఇపుడీ పరిస్ధితి వచ్చేదికాదేమో. జగన్ కు కూడా ఆ పరిస్ధితి రాకూడదంటే ముందే మేల్కొనాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: